ఆలోచన మార్చుకున్న త్రివిక్రమ్

Friday,March 22,2019 - 10:03 by Z_CLU

త్రివిక్రమ్ దారి మళ్ళాడు… అంటే ట్రాక్ తప్పాడు అని కాదు… మరింత డిఫెరెంట్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు. జస్ట్ స్క్రిప్ట్ విషయంలోనే కాదు, స్టార్స్ విషయంలో కూడా. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, NTR, నితిన్… ఈ వరసలో చిన్నగా సీనియర్ హీరోలను చేర్చే ప్రాసెస్ బిగిన్ చేశాడు. యంగ్ హీరోస్ నుండి చిన్నగా ఫోకస్ సీనియర్ హీరోస్ పై మళ్ళించాడు. ఒకేసారి చిరు, వెంకీలిద్దరినీ సినిమాకి కన్విన్స్ చేసుకున్నాడు. కొంచెం దగ్గరగా గమనిస్తే ఈ వరసలో రేపో మాపో నాగ్ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మెగాస్టార్ తో ఎలాంటి సినిమా చేస్తాడో ప్రస్తుతానికయితే తెలీదు. ప్రస్తుతానికి మెగాస్టార్ కి చెప్పింది కూడా జస్ట్ స్టోరీలైనే. ఇంకా ఆ కథ డెవెలప్ మెంట్ స్టేజ్ లోనే ఉంది. త్రివిక్రమ్ కి కూడా పెద్దగా కంగారేం లేదు. బన్ని సినిమా చేసుకున్నాక కూడా ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి బోలెడంత టైమ్ ఉంటుంది. ఎలాగూ చిరు కొరటాల సినిమా చేశాక కానీ, త్రివిక్రమ్ సినిమా గురించి ఆలోచించడు కాబట్టి ఈ లోపు కథ రెడీ చేసుకుంటాడు.

ఇక వెంకీ, త్రివిక్రమ్ కాంబో విషయానికి వస్తే, ఇది ఎప్పుడో జరిగిపోవాల్సింది. కథ అనుకోలేదో లేకపోతే త్రివిక్రమ్ కి  సీనియర్ హీరోల ఆలోచన రాక ఇంత జాప్యం జరిగిందో తెలీదు కానీ, మొత్తానికి ఎలాగోలా వెంకీ దగ్గర కూడా క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. అందుకే మిగిలింది నాగ్ మాత్రమే. ఇప్పటి దాకా ఎక్కడ పెద్దగా వినిపించలేదు కొంచెం దగ్గరగా గమనిస్తే త్రివిక్రమ్ మైండ్ లో నాగార్జున కోసం ఏదో ఓ స్టోరీలైన్ ఫిక్సయిన సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

త్రివిక్రమ్  స్టార్ ని కన్విన్స్ చేసుకునే ప్రాసెస్ లో అస్సలు ముహూర్తం చేసుకోడు. వరస సినిమాలు ఫిక్సాయి ఉన్నాయి కదా వీటి సంగతి చూశాకే, నెక్స్ట్ సినిమా అనే రూల్ అస్సలు పెట్టుకోడు. అల్టిమేట్ గా ‘ఓకె’ అనిపించుకున్నామా లేదా అనేదే త్రివిక్రమ్ పాలసీ. కాబట్టి అంచనాలు కుదిరి ఇది గనక జరిగితే త్రివిక్రమ్ సీనియర్ హీరోల టార్గెట్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయ్యాడనిపించుకుంటాడు.