Mahesh Arjun - సూపర్ స్టార్ సినిమాలో యాక్షన్ కింగ్

Tuesday,June 01,2021 - 04:01 by Z_CLU

కథ ఏదైనా, హీరో ఎవరైనా.. అందులో భారీ తారాగణం సెట్ చేయడం త్రివిక్రమ్ స్టయిల్. చిన్న పాత్రలకు కూడా పెద్ద స్టార్స్ ను తీసుకోవడం ఈ దర్శకుడి స్పెషాలిటీ. అలా చేయడం వల్ల పాత్ర ఇంపాక్ట్ మరింత పెరుగుతుందని, ప్రేక్షకుడి మనసులో ప్రతి క్యారెక్టర్ నిలిచిపోతుందని అంటాడు త్రివిక్రమ్. ఇప్పుడు తన కొత్త సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అవ్వబోతున్నాడు

త్వరలోనే మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ నటీనటుల్ని ఎంపిక చేసే పని స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా యాక్షన్ కింగ్ అర్జున్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు త్రివిక్రమ్. ఈ మేరకు డిస్కషన్లు మొదలయ్యాయి.

మహేష్-త్రివిక్రమ్ సినిమాలో అర్జున్ ఎలాంటి పాత్ర పోషిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, అర్జున్ ను కేవలం విలన్ పాత్ర కోసమే తీసుకుంటారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే, నెగెటివ్ రోల్స్ తో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తుంటాడు ఈ సీనియర్ హీరో. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్రకు, త్రివిక్రమ్ ఎలాంటి రోల్ ఇచ్చాడో అందరం చూశాం. కాబట్టి మహేష్ తో చేయబోయే సినిమాలో అర్జున్ పాత్ర సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని మాత్రం ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు అర్జున్. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు మంచి క్యారెక్టర్ రోల్స్ పోషిస్తున్నాడు. తెలుగులో ఇప్పటికే నా పేరు సూర్య, లై లాంటి సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు పోషించాడు ఈ సీనియర్ నటుడు.

action-king-senior-hero-Arjun-Sarja-zeecinemalu

యాక్షన్ కింగ్ అర్జున్

సో.. మంచి క్యారెక్టర్ ఆఫర్ చేస్తే మహేష్ సినిమాలో నటించడానికి అర్జున్ కు ఎలాంటి అభ్యంతరం ఉండదు. అలాంటి మంచి రోల్ ఉంది కాబట్టే త్రివిక్రమ్, అర్జున్ ను మీట్ అయ్యాడనేది వాస్తవం. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ ను, యాక్షన్ కింగ్ అర్జున్ ను ఒకే తెరపై చూడబోతున్నామన్నమాట.

జులైలో ఈ సినిమా లాంఛింగ్ ఉండొచ్చు. సర్కారువారి పాట షూట్ కంప్లీట్ అవ్వగానే ఈ మూవీ సెట్స్ పైకి వస్తుంది. అన్నట్టు తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేశాడు మహేష్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics