పూజా హెగ్డే.. ది మోస్ట్ ప్రొఫెషనల్

Monday,October 08,2018 - 01:49 by Z_CLU

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్ పూజా హెగ్డే. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్న ఇలాంటి టైమ్ లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఏ హీరోయిన్ అనుకోదు. కానీ పూజా హెగ్డే మాత్రం అరవింద సమేతలో తన పాత్రకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఆమె చాలా ప్రొఫెషనల్ అంటున్నాడు డైరక్టర్ త్రివిక్రమ్.

“నేను ఏ సినిమా చేసినా పరభాషా నటులకు ముందే డైలాగ్స్ అన్నీ ఇచ్చేస్తాను. డిక్షన్ ఎలా ఉండాలనే విషయంపై ఆడియో ఫైల్ కూడా పంపిస్తాను. ఏకంగా ఓ అసిస్టెంట్ డైరక్టర్ ను కూడా కేటాయిస్తాను. కానీ చాలామంది అవేవీ ఫాలో అవ్వరు. సెట్స్ పైకి వచ్చిన తడబడుతుంటారు. కానీ పూజా హెగ్డే విషయంలో మాత్రం అలా జరగలేదు.”

షూటింగ్ కు వచ్చిన మొదటి రోజు నుంచి పూజా హెగ్డే ప్రొఫెషనల్ గా ఉందని చెబుతున్నాడు త్రివిక్రమ్. ఆమెతో డబ్బింగ్ చెప్పించాలని మొదటి రోజే ఫిక్స్ అయ్యానంటున్నాడు.

“పూజా హెగ్డే ఫుల్ గా ప్రిపేర్ అయి సెట్స్ పైకి వచ్చిన విషయం, మొదటి రోజు షూటింగ్ రోజే నాకు తెలిసిపోయింది. ఎలాంటి తడబాటు లేకుండా డైలాగ్స్ చెప్పేసింది. బాగా ప్రిపేర్ అయింది. అరవింద పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాలని ఫస్ట్ డే షూటింగ్ రోజే ఫిక్స్ అయ్యాను.”

అలా అరవింద సమేత సినిమాకు పూజా హెగ్డే కూడా ప్లస్ అయిందని చెబుతున్నాడు డైరక్టర్ త్రివిక్రమ్.