త్రిష కరియర్ లోనే ఫస్ట్ టైమ్

Tuesday,July 24,2018 - 02:27 by Z_CLU

రీసెంట్ గా సెన్సార్ క్లియర్ చేసుకుని క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందింది త్రిష ‘మోహిని’ సినిమా. ఈ నెల 27 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రివేంజ్ హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉంది త్రిష.

“ నా కరియర్ లోనే ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ ప్లే చేశాను. అందుకే చాలా కొత్తగా అనిపిస్తుంది. దానికి తోడు సినిమా సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎలిమెంట్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా ఉంద’ని చెప్పుకుంది త్రిష.

ఇప్పటికే సక్సెస్ ఫుల్  హీరోయిన్ గా తనకంటూ పర్టికులర్ మార్క్ క్రియేట్ చేసుకున్న త్రిష, ఈసారి ఫుల్ ఫ్లెజ్డ్ హారర్ ఎంటర్ టైనర్ తో మెస్మరైజ్ చేయనుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ లో చనిపోయి, పగతో రగిలిపోతున్న ఒక ఆత్మలా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ డాల్ లా కనిపించనున్న త్రిష, ఈ సినిమాతో మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

R. మాదేశ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి వివేక్ మెర్విన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ప్రిన్స్ పిక్చర్స్ మరియు శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.