మెహినిగా మారిపోయిన త్రిష

Monday,July 16,2018 - 05:31 by Z_CLU

ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది త్రిష. ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు మరో మూవీ సిద్ధం చేసింది అదే మోహిని. ఫస్ట్ లుక్ తో ఇప్పటికే హల్ చల్ చేసిన ఈ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 27 తెలుగు, తమిళ భాషల్లో మోహిని చిత్రాన్ని ఒకేసారి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తమిళ్ లో ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. అందుకే అక్కడ విడుదల తేదీ ఎనౌన్స్ చేశారు. తెలుగులో ఇంకా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తికాలేదు. అవి కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ కూడా సేమ్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తారు. హారర్-థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు పోషించని డిఫరెంట్ క్యారెక్టర్ లో త్రిష కనిపించబోతోంది.

కథ ప్రకారం ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని లండన్ లో షూట్ చేశారు. మూవీలో త్రిషతో పాటు బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ నటించాడు. రమణ మాదేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది త్రిష.