నాగ్ సినిమాలో త్రిష..?

Wednesday,November 16,2016 - 10:55 by Z_CLU

నాగార్జున తన కరియర్ లోనే ఫస్ట్ టైం హారర్ జోనర్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న రాజు గారి గది సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంతలోనే మరో ఎక్జైటెడ్ న్యూస్ ఏంటంటే ఇంకా సెట్స్ పైకి రాని ఈ సినిమాలో హీరోయిన్ గా నాగ్, త్రిషని ప్రిఫర్ చేస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నమో వేంకటేశాయ సినిమాలో బిజీగా ఉన్న నాగ్, ఆ సినిమాకి ప్యాకప్ చెప్పగానే ఇమ్మీడియట్ గా ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడట. ఇక త్రిష సంగతి ప్రస్తుతానికైతే అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు కానీ, ఇది గాని ఫిక్సయితే రాజుగారి గదికి మరింత స్టార్ ఎట్రాక్షన్ యాడ్ అయినట్టే.