ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది...

Friday,September 16,2016 - 11:36 by Z_CLU

త్రిష నటించిన తాజా చిత్రం నాయకి. విడుదలకు ముందు ఈ సినిమాపై చాలా అంచనాలుండేవి. మరీ ముఖ్యంగా కత్తి పట్టుకొని త్రిష కూర్చున్న స్టిల్స్ ఇనిస్టెంట్ గా హిట్ అయ్యాయి. రఘు కుంచె సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ త్రిష మాత్రం టోటల్ యూనిట్ కు హ్యాండ్ ఇచ్చింది. ఒక్కటంటే ఒక్క ప్రచార కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. దీనిపై అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఓ సెక్షన్ మీడియా అయితే త్రిషకు వ్యతిరేకంగా వార్తలు కూడా రాసింది. ఎట్టకేలకు ఆ వివాదంపై ఈ చెన్నై బ్యూటీ రియాక్ట్ అయింది.

trisha-1

తను ఒక సినిమా గురించి మాట్లాడకపోయినా… తన సినిమాకు ప్రచారం చేయకపోయినా దానికి కచ్చితంగా ఓ కారణం ఉంటుందని త్రిష ట్వీట్ చేసింది. నాయకి సినిమాకు ప్రచారం కల్పించకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పిన త్రిష… ఏదో ఒక రోజు కచ్చితంగా కారణాలన్నీ బయటపెడతానంటోంది.