చిరు సరసన చెన్నై బ్యూటీ

Monday,November 04,2019 - 05:20 by Z_CLU

ఇప్పటికీ వీళ్లిద్దరి కాంబోలో స్టాలిన్ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ సరసన మెరవడానికి రెడీ అవుతోంది త్రిష. అంతేకాదు, ఈ సినిమాతో చాన్నాళ్ల తర్వాత స్ట్రయిట్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది ఈ చెన్నై బ్యూటీ.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రీసెంట్ గా సినిమా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా రాబోతున్న ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది.

ఈ సినిమాలో ముందుగా అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. ఆ తర్వాత నయనతార పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఊహించని విధంగా త్రిష ఈ ఛాన్స్ ఎగరేసుకుపోయింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.