విక్రమ్ సినిమా నుండి తప్పుకున్న త్రిష

Monday,October 23,2017 - 06:09 by Z_CLU

విక్రమ్ ‘సామి 2’ నుండి త్రిష తప్పుకుంది. హరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సెట్స్ పైకి రాకముందు నుండే సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2003 లో సూపర్ హిట్టయిన ‘సామి’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ సరసన త్రిషతో పాటు కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే కొన్ని క్రియేటివ్ డిఫెరెన్సెస్ వల్ల సామి 2 లో నటించడం లేదని త్రిష చేసిన ట్వీట్ ఫ్యాన్స్ ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

 

 

ఇంత ప్రెస్టీజియస్ వెంచర్ నుండి త్రిష తప్పుకోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయా..? అనే క్వశ్చన్స్ ఓ వైపు ఫ్యాన్స్ లో రేజ్ అయినా, మరోవైపు త్రిష క్యారెక్టర్ ని రీప్లేస్ చేయబోయే హీరోయిన్ ఎవరా అనే క్యూరాసిటీ కూడా పెరిగిపోయింది. ఈ సినిమాకి DSP మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.