‘నేనులోకల్’ డైరెక్టర్ తో వెంకీ

Friday,August 03,2018 - 05:57 by Z_CLU

మరో కొత్త సినిమాకి సంతకం చేశాడు వెంకటేష్. ప్రస్తుతం F2 సినిమాతో సెట్స్ పై ఉన్న వెంకీ, మరోవైపు నాగచైతన్య తో ‘వెంకీమామ’ సినిమాకి ప్రిపేర్ అవుతున్నాడు ఈ లోపు నేను లోకల్ డైరెక్టర్ త్రినాథ రావు నక్కినకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్, త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమాలో వెంకటేష్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి కథ – మాటలు అందిస్తున్న  ప్రసన్న కుమార్ ప్రస్తుతం ఈ కథకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘F2’ , బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘వెంకీ మామ’ సినిమాలతో బిజీగా ఉన్నాడు వెంకటేష్. త్రినాద్ రావు కూడా ఈ గ్యాప్ లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రామ్ సినిమాని కంప్లీట్ చేసి, ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.