రోబో 2.0 ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్

Wednesday,November 08,2017 - 03:32 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రెస్టీజియస్ మూవీ 2.0. ఈ సినిమా పాటలు ప్రస్తుతం యూత్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. విడుదలైనవి 2 పాటలే అయినప్పటికీ, ఆ రెండు పాటల్ని రిపీట్ మోడ్ లో వింటున్నారు ఆడియన్స్. అలా 2.0 జూక్ బాక్స్ రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదు చేసింది. సాంగ్స్ రిలీజ్ అయిన ఈ 11 రోజుల్లో 2.0 జూక్ బాక్స్ కు 40లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలుపుకొని ఇన్ని వ్యూస్ రికార్డు చేసింది 2.0 జూక్ బాక్స్.

దుబాయ్ లో ఈ సినిమా పాటల్ని అట్టహాసంగా విడుదల చేసి విషయం తెలిసిందే. సినిమాలో పాటలు 3 మాత్రమే ఉన్నాయి. వీటిలో 2 పాటల్ని దుబాయ్ లో విడుదల చేశారు. మరో ప్రత్యేక సందర్భంలో మిగిలిన ఆ మూడో పాటను కూడా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ రెండు పాటలు టాప్ చార్టబస్టర్స్ గా నిలిచాయి.

రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న 2.0 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ మోడ్ లో ఉంది. శంకర్ దర్శకత్వంలో దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 25న విడుదల చేయబోతున్నారు.