2.0 టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్

Friday,September 14,2018 - 11:03 by Z_CLU

దాదాపు ఏడాదిగా వెయిట్ చేస్తున్న 2.0 సినిమా హంగామా మొదలైంది. వినాయక చవితి కానుకగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. సినిమాపై ఉన్న భారీ అంచనాల్ని టీజర్ ఎలివేట్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో వ్యూస్ నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఈ టీజర్ కు ఒక్క యూట్యూబ్ లోనే 53 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్ లాంటి ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ తో పోల్చి చూస్తే కోటికి పైగా వ్యూస్ సంపాదించింది 2.0 టీజర్.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఒక్క యూట్యూబ్ లోనే ఈ 3 భాషల టీజర్లన్నీ కలిపి 24 మిలియన్ వ్యూస్ నమోదు చేశాయి. ఇక మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ కూడా కలుపుకుంటే 3 భాషల టీజర్లకు కలిసి 3 కోట్ల 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. రజనీకాంత్ మూవీపై ఉన్న క్రేజ్ ను ఈ అంకెలు సూచిస్తున్నాయి.

మొన్నటివరకు ఈ సినిమా బడ్జెట్ ను 450 కోట్ల రూపాయలు అనుకున్నాం. కానీ తాజాగా ఈ సినిమా బడ్జెట్ 543 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో విలన్ గా నటించిన అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా 14 భాషల్లో విడుదలకానుంది.