KGF2 - క్రేజీ అప్ డేట్ వచ్చేసింది

Saturday,December 19,2020 - 01:52 by Z_CLU

దేశమంతా ఈగర్ గా ఎదురుచూస్తోన్న సినిమా KGF2. లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. దీంతో మూవీ ప్రమోషన్ ను అఫీషియల్ గా స్టార్ట్ చేయబోతున్నారు. దానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఈనెల 21న కేజీఎఫ్2 నుంచి ఓ ట్రీట్ రాబోతున్నట్టు ఎనౌన్స్ చేసింది యూనిట్. ఆరోజున ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ట్రీట్ ఉంటుందని చెప్పిన యూనిట్ అదేంటనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఫస్ట్ లుక్ వస్తుందా.. మోషన్ పోస్టర్ వస్తుందా.. డైరక్ట్ గా టీజర్ రిలీజ్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్-1 దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయింది. అన్ని భాషల్లో ప్రేక్షకులు ఈ సినిమాను ఎగబడి చూశారు. అలాంటి క్రేజీ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అయింది. షూటింగ్ దాదాపు పూర్తయింది. 21న రిలీజ్ డేట్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది.