రవితేజ ‘టచ్ చేసి చూడు’ ట్రైలర్ రిలీజయింది

Thursday,January 25,2018 - 05:41 by Z_CLU

ఫిబ్రవరి 2 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది రవితేజ ‘టచ్ చేసి చూడు’ మూవీ. రవితేజ మార్క్ మాస్ & ఫ్యామిలీ  ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజయింది. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది.

‘ఫ్యామిలీ ఈజ్ ఎ ఎమోషన్ ఆఫ్ ఇమోషన్స్’ అంటూ బిగిన్ అయ్యే ఈ సినిమా ట్రైలర్, రవితేజని పక్కా ఫ్యామిలీ మ్యాన్ లా ప్రెజెంట్ చేస్తుంది. ఇక రాశిఖన్నా, సీరత్ కపూర్ సినిమాలో కావాల్సినంత గ్లామర్ డోస్ ఉందని క్లారిటీ ఇస్తూనే, సడెన్ గా సినిమాని యాక్షన్ మోడ్ లోకి తీసుకు వెళ్ళే కాంఫ్లిక్ట్ పాయింట్ తో పాటు రవితేజ పవర్ పోలీసాఫీసర్ గా మారే ట్రాన్స్ ఫర్మేషన్ సినిమాపై ఇంట్రెస్ట్ ని రేజ్ చేస్తున్నాయి.

విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ స్టోరీ రాశాడు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలన్సింగ్ అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.