టచ్ చేసి చూడు ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

Monday,February 05,2018 - 07:00 by Z_CLU

రవితేజ, రాశిఖన్నా, సీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా టచ్ చేసి చూడు. విక్రమ్ సిరికొండ డైరక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. రవితేజ మాస్ యాక్టింగ్ కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు వరల్డ్ వైడ్ టచ్ చేసి చూడు సినిమాకు 8 కోట్ల 41 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చింది. ఈ సినిమా 21 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది.

ఏపీ, నైజాం 3 రోజుల వసూళ్లు (షేర్)

నైజాం – రూ. 2.85 కోట్లు
సీడెడ్ – రూ. 0.91 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.85 కోట్లు
ఈస్ట్ – రూ. 0.64 కోట్లు
వెస్ట్ – రూ. 0.44 కోట్లు
కృష్ణా – రూ. 0.43 కోట్లు
గుంటూరు – రూ. 0.66 కోట్లు
నెల్లూరు – రూ. 0.30 కోట్లు

3 రోజుల టోటల్ షేర్ – రూ. 7.08 కోట్లు