రూ.600 కోట్ల సినిమాలో స్పెషాలిటీ ఏంటి?

Wednesday,November 28,2018 - 05:34 by Z_CLU

ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని సినిమాలు కచ్చితంగా చూడాల్సిందే. సిల్వర్ స్క్రీన్ పై ఆ మేజిక్ ఎంజాయ్ చేయాల్సిందే. సరిగ్గా అలాంటి సినిమానే 2.0. రజనీకాంత్-శంకర్ కాంబోలో మూడో సినిమాగా వస్తున్న 2.0ను ఎందుకు చూడాలనే ప్రశ్నకు ఒకటి కాదు, రెండు కాదు.. ఎన్నో సమాధానాలున్నాయి. వాటిలో టాప్-10 రీజన్స్ చూద్దాం.

ఏదో ఒక సినిమా తీద్దాం అనుకుని సెట్స్ పైకి వచ్చిన రెగ్యులర్ సినిమా కాదిది. ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఇండియాస్ ప్రెస్టీజియస్ వెంచర్ గా మూడేళ్ల క్రితం బిగిన్ అయిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ భారతీయ సినీచరిత్రలోనే ఓ రివొల్యూషన్ తీసుకురాబోతోంది.

ఒక సినిమాని రెగ్యులర్ ఫార్మాట్ లో తెరకెక్కించి దానిని 3D ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడం ఒక పద్ధతి. అదే సినిమాని 3D కెమెరాలతో రియల్ టైమ్ ఎక్స్ పీరియన్స్ కలిగేలా తెరకెక్కించడం మరో పద్ధతి. 2.0 రెండో కోవలోకి వస్తుంది. దానికి తోడు ఏ మాత్రం కాంప్రమైజ్ కాని హాలీవుడ్ స్థాయి VFX ఎలిమెంట్స్ ఆడియెన్స్ కి ఫీస్ట్ లాంటి అనుభూతిని కలిగించనున్నాయి.

 రోబో సినిమాలో చిట్టి, వశీకరణ్ అనే రెండు పాత్రలతో మెస్మరైజ్ చేశాడు సూపర్ స్టార్. ‘చిట్టి’ గా ఫ్యాన్స్ గుండెల్లో అడిషనల్ స్పేస్ క్రియేట్ చేసుకున్న ఈ సూపర్ స్టార్, 2.0 లో మళ్ళీ అవే క్యారెక్టర్స్ లో డిఫెరెంట్ చాలెంజెస్ ని ఫేస్ చేస్తూ కనిపించనున్నాడు. రోబో ఎదుర్కొన్న సవాళ్ల కంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైన ఛాలెంజెస్ ను ఫేస్ చేస్తాడు మన రీ-లోడెడ్ చిట్టి.

రోబో సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి, హాలీవుడ్ స్థాయిని తీసుకొచ్చి పెట్టిన ఈ దర్శకుడు, 2.0 లో మరో అద్భుతమైన ప్రపంచాన్నే సృష్టించాడు. ఈ సినిమాతో సరికొత్త టెక్నాలజీని సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ చేయనున్నాడు ఈ మాసివ్ ఫిల్మ్ మేకర్.

శంకర్ విజన్ కి లైఫ్ లాంటి ఎలిమెంట్ ఇది. ఇప్పటికే సూపర్ హిట్ అయిన సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తే, సినిమాలో రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, 2.0 ని వరల్డ్ కాన్వాస్ పై మరింత ఎట్రాక్టివ్ గా ప్రెజెంట్ చేయనుంది. శంకర్-రెహ్మాన్ కాంబినేషన్ ఆడియన్స్ కు కొత్తకాదు. 2.0 సినిమాతో కలుపుకొని వీళ్లిద్దరి కాంబోలో 11 సినిమాలొచ్చాయి.

‘2.0’కు మరో పెద్ద ఎట్రాక్షన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఓ సౌత్ హీరోతో అక్షయ్ కుమార్ పనిచేయడం ఇది రెండోసారి. గతంలో నాగార్జునతో వర్క్ చేసిన అక్షయ్, మళ్లీ ఇన్నేళ్లకు సూపర్ స్టార్ రజనీకాంత్ తో 2.0లో నటించాడు. ఓవైపు బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూ, 2.0లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడం నిజంగా గొప్ప విషయం.

తన స్టయిల్ తో మెస్మరైజ్ చేసే రజనీకాంత్, ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది. దీనికి సమాధానమే 2.0 సినిమా. ఈ సినిమాలో కేవలం హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ మాత్రమే కాదు.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కూడా ఉంటుందని ప్రకటించాడు డైరక్టర్ శంకర్.

‘రోబో’లో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించింది. 2.0లో మాత్రం ఆమెను రిపీట్ చేయలేదు. ఏరికోరి ఎమీ జాక్సన్ ను తీసుకున్నారు. దీనికి చాలా పెద్ద కారణమే ఉందంటోంది యూనిట్. ఎమీ పాత్రపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కెరీర్ లో తన 16వ సినిమాగా ఇందులో నటించిన ఎమీ, ఇన్నాళ్లూ గ్లామర్ డాళ్ గా మాత్రమే కనిపించింది. కానీ 2.0లో కళ్లుచెదిరే ఫైట్స్ చేసింది.

ఈ సినిమా స్టోరీలైన్ కూడా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న మెయిన్ పాయింట్స్ లో ఒకటి. మనిషి జీవితంలో ఓ భాగంగా మారిపోయిన సెల్ ఫోన్ చుట్టూ శంకర్ కథ అల్లడం ఈ సినిమాను అందరికీ కనెక్ట్ చేసింది. విలన్ క్యారెక్టర్ ను సెల్ ఫోన్లతో క్రియేట్ చేసిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. సినిమాలో ఎన్ని ఎట్రాక్షన్స్ ఉన్నప్పటికీ, ఈ స్టోరీలైన్ పైనే యూనిట్ ఎక్కువ హోప్ పెట్టుకుంది.

‘2.0’ మూవీని ఎందుకు చూడాలనే ప్రశ్నకు ఇది కూడా ఓ సమాధానం. సూపర్ డూపర్ హిట్ అయిన రోబో సినిమాకు సీక్వెల్ గా ఓ సినిమా వస్తోందంటే ఎవరికైనా ఆసక్తే. ఇలా ఎన్నో రీజన్స్, 2.0ను టాప్ ట్రెండింగ్స్ లో నిలిపాయి.