బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్స్

Friday,December 21,2018 - 10:02 by Z_CLU

ఈ రోజు ఇద్దరు టాలీవుడ్ బ్యూటీస్ గ్రాండ్ గా బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. వారిలో ఒకరు మిల్కీ బ్యూటీ తమన్నా అయితే మరొకరు సక్సెస్ ఫుల్ సింగర్ గా దాదాపు 50 సాంగ్స్ కి పైగా పాడి, బిజీ సింగర్ గా కొనసాగుతున్న  ట్యాలెంటెడ్ హీరోయిన్ ఆండ్రియా జెరిమియా. వీరిద్దరూ ‘తడాఖా’ సినిమాలో అక్కా చెల్లెళ్ళుగా నటించారు.

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్నా, ఈ రోజు తన 29 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటుంది. మంచు మనోజ్ ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన ఈ మిల్కీబ్యూటీ పదేళ్ళకు పైగా తన కరియర్ లో సౌత్ సినిమాల్లోనే కాదు బాలీవుడ్ లోను తన మార్క్ రిజిస్టర్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది.

అటు సింగర్ గా ఇటు హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఆండ్రియా ఈ రోజు తన 34 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటుంది. రీసెంట్ గా ‘గృహం’ సినిమాతో ఇంప్రెస్ చేసిన ఆండ్రియా, కమల హాసన్ విశ్వరూపం సినిమాలోను కీ రోల్ ప్లే చేసి ఇంప్రెస్ చేసింది. పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాల్లో నటిస్తూ ఆల్ రౌండర్ అనిపించుకుంటుంది ఆండ్రియా.

అటు గ్లామరస్ రోల్స్ తో ఇంప్రెస్ చేస్తూనే, హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే కీ రోల్స్ లో నటిస్తూ, బిజీ బిజీగా ఉన్న  వీరిద్దరూ మరెన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ బర్త్ డే విషెస్ అందజేస్తుంది జీ సినిమాలు.