'శ్రీనివాస కళ్యాణం'లో టాప్ హీరో ?

Tuesday,April 11,2017 - 10:00 by Z_CLU

లేటెస్ట్ గా ‘శతమానం భవతి’ తో గ్రాండ్ హిట్ సాధించి నేషనల్ అవార్డు అందుకున్న దిల్ రాజు-సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో తెరకెక్కనున్న మరో ఫామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది..

ఓ పెళ్లి చుట్టూ జరిగే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాను ఇటీవలే అనౌన్స్ చేసిన దిల్ రాజు హీరో విషయం లో మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మొన్నటి వరకు దిల్ రాజు ఈ సినిమాను రాజ్ తరుణ్ తో ప్లాన్ చేస్తున్నారనే వార్త చక్కర్లు కొట్టగా ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను రాజ్ తరుణ్ తో కాకుండా మరో టాప్ స్టార్ హీరోతో తెరకెక్కించాలని భావిస్తున్నాడట దిల్ రాజు. మరి ‘శ్రీనివాస కళ్యాణం’లో శ్రీనివాస్ గా కనిపించే ఆ టాప్ హీరో ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..