Bangarraju - ఎందుకు చూడాలి ? టాప్-6 రీజన్స్ ఇవే..!

Thursday,January 13,2022 - 10:00 by Z_CLU

ఏ సినిమా చూడాలన్నా దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అలాగే నాగార్జున – నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కి సంక్రాంతి బరిలో నిలిచిన బడా సినిమా ‘బంగార్రాజు’ కి కూడా ఓ ఆరు రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.

bangarraju nagarjuna nagachaitanya

నాగార్జున – నాగ చైతన్య కాంబో 

బంగార్రాజు సినిమా చూడటానికి ఫస్ట్ రీజన్ కింగ్ నాగార్జున , యువ సామ్రాట్ నాగ చైతన్య. అవును ఈ కాంబినేషన్ సినిమా అంటే అక్కినేని ఫ్యాన్స్ కే కాదు మూవీ లవర్స్ అందరికీ స్పెషలే. కాకపోతే నాగార్జున ని సోగ్గాడిగా చూసేశాం కానీ చైతు ఈ రోల్ ఎలా చేశాడు ? ఈ తరహా పాత్రతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక టీజర్ లో ఈ ఇద్దరూ నడిచే షాట్ చూస్తే తండ్రి కొడుకులను స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా ? అనే ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో కలుగుతోంది.

bangarraju nagarjuna

‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ 

కొన్ని బ్లాక్ బస్టర్స్ సినిమాలకు సీక్వెల్ అంటే అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి.  ‘సోగ్గాడే చిన్ని నయన’కి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ తెరకెక్కుతుందని నాగ్ చెప్పినప్పటి నుండే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోకి నాగ్ తో కలిసి చైతూ కూడా నటించడంతో ఈ సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి. ముఖ్యంగా నాగ్ -రమ్య కృష్ణ పెయిర్ కూడా ఇందులో రిపీట్ అవుతుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఆ ఏడాది సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. యూత్ , ఫ్యామిలీ, మాస్ ఇలా అందరినీ ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్ అంటే ఆటోమేటిక్ గా ఈ సీక్వెల్ ఎప్పుడెప్పుడు చూద్దామా ? అనే ఎగ్జైట్ మెంట్ కలగడంలో సందేహం లేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే సినిమాతో మెప్పించినట్టే ఈ సీక్వెల్ తో మెస్మరైజ్ చేయడం ఖాయం అనిపిస్తుంది.

bangarraju

అనూప్ సాంగ్స్ 

సోగ్గాడు చిన్ని నాయన సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్ అనూప్ సాంగ్స్. ఇప్పుడు బంగార్రాజు కి కూడా రిలీజ్ కి ముందే తన సాంగ్స్ తో హైప్ క్రియేట్ చేశాడు అనూప్. లడ్డుండా , నాకోసం పుట్టవా నువ్వు , వాసి వాడి తస్సాదియ్యా పాటలు  పాపులర్ సాంగ్స్ అనిపించుకున్నాయి. ఈ సాంగ్స్ సినిమాలో  విజువల్ గా ఎలా ఉంటాయో అనే క్యూరియాసిటీ రైజ్ అవుతుంది.

KrithiShetty-firstlook-from-bangarraju-revealed

హీరోయిన్ కృతి శెట్టి 

చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కృతి శెట్టి కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడి కోసం మొదటి షో చూసే యువత ఎందఱో. నాగ లక్ష్మి పాత్రలో కృతి అందం , అభినయం ఎలా ఉండనుందో టీజర్ , ట్రైలర్ లో హింట్ ఇచ్చారు కాబట్టి సినిమాలో కృతి కూడా హైలైట్ అవ్వనుందని అర్థమవుతుంది.

Bangarraju-Teaser-Shot

డివోషనల్ సీక్వెన్స్ 

సినిమాలో డివోషనల్ సీక్వెన్స్ లు ఉన్నాయని టీం ఇప్పటికే పలు మార్లు చెప్పారు. తాజాగా చైతు కూడా సినిమా ఆరంభంలో గుడిలో సునామి రావడం , శివుడి విగ్రహాన్ని నీళ్ళు తాకడంతో ఓ సీక్వెన్స్ ఉందని చెప్పాడు. అలాగే క్లైమాక్స్ లో కూడా అలాంటి డివోషనల్ డ్రామాతో యాక్షన్ ఎపిసోడ్ తో అదిరిపోయే సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్స్ అంటున్నారు.

పండుగ సినిమా 

సంక్రాంతి పండగకి అన్ని ఎలిమెంట్స్ ఉండే ఫుల్ మీల్స్ లాంటి సినిమా చూడాలనుకుంటారు ఆడియన్స్. సరిగ్గా అలాంటి పండుగ సినిమానే ‘బంగార్రాజు’. అందుకే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాకే షూటింగ్ మొదలు పెట్టాడు నాగార్జున. లవ్ , రొమాన్స్ , యాక్షన్ , ఫన్ , బ్యూటిఫుల్ సాంగ్స్ , మాస్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ కలగలిపిన విందు భోజనం లాంటి సినిమా ‘బంగార్రాజు’.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics