ఈ 'మజ్ను' ఎందుకంత స్పెషల్..?

Wednesday,January 23,2019 - 05:09 by Z_CLU

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘మిస్టర్ మజ్ను’ ఫీవర్ కనిపిస్తుంది. టాలీవుడ్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్  కొత్త కాదు కానీ, ఈ మజ్ను మాత్రం డెఫ్ఫినెట్ గా సమ్ థింగ్ స్పెషలే. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో చూడాల్సిందే అనిపించేంతలా ఎట్రాక్ట్ చేస్తున్న టాప్ 5 రీజన్స్ ఇవే.

స్టోరి లైన్ :

మిస్టర్ మజ్ను’ అనగానే ఇమ్మీడియట్ గా మైండ్ లో తిరిగే ఎలిమెంట్ ఈ సినిమా స్టోరీలైన్. ఆ తరవాత ట్రైలర్ లో రివీల్ అవుతున్న అఖిల్ క్యారెక్టర్. ఓ వైపు యూత్ ఫుల్ గా కనిపిస్తూనే,మరోవైపు స్ట్రాంగ్ ఇమోషన్స్ ఉన్న యంగ్ స్టర్ లా కనిపిస్తున్నాడు అఖిల్.

సిక్స్ ప్యాక్ :  

మిస్టర్ మజ్ను’ టైటిల్ ట్రాక్ రిలీజ్ టైమ్ లో రిలీజ్ చేసారు అఖిల్ 8 ప్యాక్ లుక్స్. ఈ సాంగ్ కి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో, ఈ లుక్స్ కూడా అదే స్థాయిలో రిజిస్టర్ అయ్యాయి. మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ లో మ్యాగ్జిమం ఈ లుక్స్ లోనే కనిపించబోతున్నాడు అఖిల్. ఆ మ్యాజిక్ సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

వెంకీ అట్లూరి 

యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ని, ఇమోషనల్ సీక్వెన్సెస్ బ్లెండ్ చేయడంలో వెంకీ అట్లూరి ఎక్స్ పర్ట్ అనే ఇమేజ్ ఉంది ఫ్యాన్స్ లో. అలాంటి పర్ఫెక్ట్  ఫిల్మ్ మేకర్ కి అఖిల్ చరిష్మా జోడైతే బొమ్మ అదిరిపోవాల్సిందే అనే స్థాయిలో అంచనాలున్నాయి. ఈ సినిమా ఇంతగా ఎట్రాక్ట్ చేయడానికి ఈ కాంబో కూడా రీజనే.

మ్యూజిక్ : 

తమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి ఈ సినిమా సాంగ్స్. జస్ట్ అడియోకే ఈ స్థాయిలో వైబ్స్ ఉంటే, ఇక సినిమాలో ఈ సాంగ్స్ ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తాయోనన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఉంది. దానికి తోడు ఈ సాంగ్ ప్రోమోస్ లో రివీల్ అవుతున్న విజువల్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.

బ్యానర్ :  

భారీ సినిమాల నిర్మాత B.V.S.N ప్రసాద్ నిర్మించారు ఈ సినిమాని. గతంలో ‘అత్తారింటికి దారేది, ‘నాన్నకు ప్రేమతో’ లాంటి ప్రెస్టీజియస్ సినిమాలనందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కడం ‘మిస్టర్ మజ్ను’ పై మరింత ఫోకస్ పెరిగేలా చేస్తుంది.