ఆడియో రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్

Wednesday,October 18,2017 - 11:15 by Z_CLU

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2.0 ఆడియో లాంచ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి సరిగ్గా మరో 10 రోజుల్లో.. అంటే 27వ తేదీన ఈ సినిమా ఆడియోను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. నిజానికి ఆడియో ఫంక్షన్ అనేది ఏ సినిమాకైనా చాలా కామన్. కానీ 2.0 ఆడియో ఫంక్షన్ పై ఆసక్తి కలగడానికి రీజన్స్ చాలా ఉన్నాయి.


మొదటి రీజన్ – వేదిక
కనీవినీ ఎరుగని రీతిలో దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పార్క్ లో 2.0 ఆడియోను విడుదల చేయబోతున్నారు. ఓ ఇండియన్ మూవీ ఆడియో ఫంక్షన్ ను బుర్జ్ ఖలీఫాలో సెలబ్రేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వేదికల్లో ఇదొకటి. ఇందులోకి వెళ్లాలంటే 4 సెక్యూరిటీ చెక్ లు దాటి వెళ్లాలి.

రెండో రీజన్ – లైవ్ పెర్ఫార్మెన్స్
2.0 ఆడియోపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి మరో రీజన్ లైవ్ పర్ఫార్మెన్స్. అవును.. ఆరోజున ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ లైవ్ షో ఇవ్వబోతున్నాడు. శంకర్, రజనీకాంత్ సినిమాలకు గతంలో తను కంపోజ్ చేసిన సూపర్ హిట్ సాంగ్స్ ను మరోసారి ఆలపించబోతున్నాడు. వీటితో పాటు మరికొన్ని సూపర్ హిట్స్ కూడా రానున్నాయి.

మూడో రీజన్ – రెహ్మాన్ సంగీతం
2.0 మూవీ ఆడియోపై క్యూరియాసిటీ పెరగడానికి మరో బేసిక్ రీజన్ రెహ్మాన్. ఈ సంగీత దర్శకుడు కంపోజ్ చేసిన పాటలపై సహజంగానే శ్రోతలకు ఆసక్తి ఉంటుంది. అదే ఇంట్రెస్ట్ 2.0 ఆడియోపై కూడా ఉంది. ఎప్పుడు పాటలు మార్కెట్లోకి వస్తాయా.. విని ఎంజాయ్ చేద్దామా అని సంగీతాభిమానులు ఎదురుచూస్తున్నారు.

నాలుగో రీజన్ – బడ్జెట్
ఆడియో ఫంక్షన్ కు మరో స్పెషల్ ఎట్రాక్షన్ బడ్జెట్. కేవలం ఈ ఒక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసమే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ బడ్జెట్ తో తెలుగులో మంచి కంటెంట్ తో మీడియా రేంజ్ లో సినిమా తీయొచ్చు. అతిథులందర్నీ తమ సొంత ఖర్చుతో వేడుకకు తీసుకెళ్తున్నారు. బుర్జ్ ఖలీఫాలో ఆతిథ్యం ఇవ్వబోతున్నారు.

ఐదో రీజన్ – శంకర్-రెహ్మాన్ కాంబో
ఆడియో ఫంక్షన్ పై ఉత్సుకత పెరగడానికి మరో రీజన్ శంకర్-రెహ్మాన్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ఏ సినిమా ఆడియో పరంగా డిసప్పాయింట్ చేయలేదు.