ఆ 3 సినిమాలదే హవా...

Wednesday,October 19,2016 - 05:26 by Z_CLU

ఓ రెండు మూడు సార్లు చూస్తే సినిమా బోర్ కొట్టొచ్చేమో కానీ ఆడియో మాత్రం ఎప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. అందుకే యూట్యూబ్ జ్యూక్ బాక్స్ కి అంత డిమాండ్. ఇంతకీ తెలుగు సినిమాల్లో ఎక్కువ వ్యూస్ ని రికార్డు చేసునుకున్న సినిమాలేంటో తెలుసా…?

తెలుగులో బాహుబలి, శ్రీమంతుడు, S/O సత్యమూర్తి పాటలకు ఇంకా ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి 94.8 లక్షల వ్యూస్ తో మొదటి స్థానంలో ఉంది.  కీరవాణి అందించిన ఈ మ్యూజికల్ మేజిక్ కి ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదు.

collage

మహేష్ బాబు శ్రీమంతుడు కూడా తన హవా చూపిస్తోంది. బాహుబలి తర్వాత స్థానం దీనిదే. ఈ సినిమా జూక్ బాక్స్ కి ఇప్పటి వరకు 80 లక్షల వ్యూస్ నమోదయ్యాయి. ఇక తరవాతి స్థానంలో అల్లు అర్జున్ చేసిన S/O సత్యమూర్తి, 79.18 లక్షల వ్యూస్ తో థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఈ రెండు సినిమాలకు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కావడం విశేషం.