టాప్-20 ఫిలిమ్స్ ఆఫ్ 2016

Sunday,December 25,2016 - 09:02 by Z_CLU

 

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్, సూపర్ హిట్స్ అందుకోగా మరికొన్ని యావరేజ్, ఫ్లాపులు తో సరిపెట్టుకున్నాయి. అలా 2016లో టాప్ 20 హిట్స్ గా నిలిచిన సినిమాల పై ఓ జీ-రౌండప్..

jr-ntr-janatha-garage-movie-release-date-posters-4

2016లో ‘జనతా గ్యారేజ్’ తో అదిరిపోయే గ్రాండ్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. మొదటిసారిగా కొరటాల శివ డైరెక్షన్ లో నటించిన యంగ్ టైగర్ ఈ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ స్కోర్ చేశాడు. చక్కని మెసేజ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ సాధించి 2016 గ్రాండ్ హిట్ గా నిలిచింది.

Allu Arjun Sarainodu Movie First Look HD Posters, WallPapers

2015 నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ… 2016లో కూడా అదే జోరు కొనసాగించాడు. సరైనోడు సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అప్పటివరకు రేసుగుర్రం పేరిట ఉన్న తన వ్యక్తిగత రికార్డులు అన్నింటినీ సరైనోడుతో క్రాస్ చేశాడు.

soggade-chinni-nayana

ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ బోణీ కొట్టాడు కింగ్ నాగార్జున. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం థియేటర్స్ కు క్యూ కట్టించి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నాగ్.

dhruva

‘ధృవ’ తో 2016లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తమిళ్ లో గ్రాండ్ హిట్ సాధించిన ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాతో 2016కు గ్రాండ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు చెర్రీ.

oopiri

తమిళ హీరో కార్తీతో కలిసి 2016లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నాగ్.  ఏడాది ప్రారంభం లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ తో బ్లాక్ బస్టర్ బోణీ కొట్టిన మన్మధుడు ‘ఊపిరి’ తో మరో హిట్ సొంతం చేసుకున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో  ‘ఇంటచబుల్’ అనే ఫ్రెంచ్ సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది.

Jr NTR Nannaku Prematho Movie Facebook Covers First Look Posters WallPapers

ఎన్టీఆర్ కెరీర్ ను డిఫరెంట్ ట్రాక్ లో పెట్టిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా నుంచే విలక్షణమైన పాత్రలు ఎంచుకోవడం, కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేశాడు తారక్. ఫస్ట్ టైం సుకుమార్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ కు 25వ చిత్రమే కాకుండా… యంగ్ టైగర్ కెరీర్ లో విలక్షణ చిత్రంగా కూడా నిలిచిపోయింది.

a-aa-movie-audio-by-pawan

త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘ అ ఆ’ సినిమా ఈ ఏడాది బంపర్ హిట్ గా నిలిచింది. నితిన్-సమంత ఫ్రెష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాతో మారోసారి తన మేజిక్ రిపీట్ చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఫుల్లెన్త్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నితిన్ ను ఓవర్సీస్ స్టార్ గా మార్చేసింది.

ram-nenu-sailaja-movie-wallpapers-13

2016 స్టార్టింగ్ లో ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేసి తొలి హిట్ అందుకుంది ‘నేను శైలజ’ సినిమా. రామ్, కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వం లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2016లో మొట్టమొదటి సూపర్ హిట్.

Surabhi, Sharwanand in Express Raja Movie Release Jan 14 Wallpapers

ఈ ఏడాది ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో ఎక్స్ ప్రెస్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. సంక్రాంతి బరిలో బడా సినిమాలతో పాటు రిలీజ్ అయినా ఈ సినిమా 2016  సూపర్ హిట్స్ లో మంచి స్థానం అందుకుంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన  ఈ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు శర్వానంద్.

anasuya-kshanam-telugu-movie-posters-2

మొదటి రోజు నుండే ఆడియన్స్ తో పాటు స్టార్స్ నుంచి కూడా  ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది ‘క్షణం’ . అడవి శేష్ హీరోగా రవికాంత్ పేరెపు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా 2016లో ఓ విలక్షణ చిత్రంగా పేరుతెచ్చుకుంది.

krishna-gadi-veera-prema-gadha-images_2

నాని హీరోగా ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ ఈ ఏడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.  స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా 2016 బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. నానికి గోల్డెన్ హ్యాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

maxresdefault2

ఈ ఏడాది ‘సుప్రీమ్’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్సే సాధించింది. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేసి ఈ ఏడాది సూపర్ హిట్ లిస్ట్ ఈ సినిమాను కూడా చేర్చేశాడు సాయి ధరమ్ తేజ్ …

naga_chaitanya_premam_movie-1600x900

2016లో గట్టిగా సందడి చేసిన సినిమాల్లో ‘ప్రేమమ్’ కూడా ఒకటి. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మలయాళ సినిమా ‘ప్రేమమ్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా 2016 రీమేక్ హిట్స్ లో సూపర్ హిట్ గా చోటు దక్కించుకుంది. ఈ సినిమాతో ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ అందుకున్నాడు చైతూ..

epc

2016 ఎండింగ్ లో అదిరిపోయే హిట్ అందుకుంది ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా. నోట్ల రద్దు తో అన్ని సినిమాలు వెనక్కితగ్గితే, ఇది మాత్రం ముందుకెళ్లింది. ఓవైపు జనాలు ఇబ్బంది పడినా మరోవైపు ఈ సినిమా భారీ కలెక్షన్స్ అందుకొని హౌరా అనిపించింది. ఈ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు నిఖిల్.

gentleman-movie-latest-wallpapers-3

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని డ్యూయెల్ రోల్ లో నటించిన ‘జెంటిల్ మెన్’ సినిమా కూడా ఈ ఏడాది సూపర్ హిట్ లిస్ట్ లో  చోటు దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో ఈ ఏడాది రెండో సూపర్ హిట్  అందుకున్నాడు నాని.

allu-sirish-sreerasthu-shubhamasthu-movie-wallpapers-03

‘శ్రీ రస్తు శుభమస్తు’ తో కెరీర్ లో సూపర్ హిట్ అందుకున్నాడు మెగా హీరో అల్లు శిరీష్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. హిట్ లిస్ట్ లో ప్లేస్ కొట్టేసింది.

jyo-achythananda-movie-posters-2

‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో జాయింట్ గా హిట్ అందుకున్నారు నారా రోహిత్ – నాగశౌర్య. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ను మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.

ritu-varma-pellichoopulu-movie-posters-9

ఈ ఏడాది రిలీజ్ కి ముందే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని రిలీజ్ తర్వాత కూడా అదే టాక్ తో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది ‘పెళ్లి చూపులు’. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీలో అందరి ప్రశంశలు అందుకుంది.

eedo-rakam-aado-rakam-movie-wallpaper-03

ఈ ఏడాది విష్ణు-రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాతో హిట్ అందుకున్నారు. కామెడీ సినిమాల దర్శకుడు జి,నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో  కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది.

terror-movie-review

‘టెర్రర్’ సినిమాతో 2016లో హీరోగా ఓ హిట్ అందుకొని తను కూడా ఫామ్ లో ఉన్నానని రుజువు చేసుకున్నాడు శ్రీకాంత్. ఓ పక్క క్యారెక్టర్ నటుడిగా సినిమాలు చేస్తూనే మారో వైపు హీరోగా నటిస్తున్న శ్రీకాంత్… ఈ సీనియర్ హీరో 2016 హిట్ హీరోల లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు.