జయహో టాలీవుడ్.. టాప్-10లో 2 సినిమాలు
Thursday,December 12,2019 - 09:07 by Z_CLU
బాహుబలి సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో దేశానికి తెలిసొచ్చింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ జనాలు తెలుగు సినిమాల్ని తక్కువ చేసి చూడడం పూర్తిగా మానేశారు. అలా టాలీవుడ్ ముఖచిత్రాన్నే బాహుబలి మార్చేయగా.. ఆ ట్రెండ్ ను ఈ ఏడాది వచ్చిన మరో రెండు సినిమాలు కొనసాగించాయి.
ఈ ఏడాది వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన టాప్-10 సినిమాల్లో రెండు తెలుగు సినిమాలకు చోటుదక్కింది. అవే సాహో, సైరా. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా సత్తాను, మార్కెట్ ను మరోసారి చాటిచెప్పాడు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో సాహో ఏకంగా రెండో స్థానంలో నిలవగా, సైరాకు 9వ స్థానం దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన భారతీయ సినిమాలివే
1. వార్ – రూ. 475 కోట్లు
2. సాహో – రూ. 439 కోట్లు
3. కబీర్ సింగ్ – రూ. 380 కోట్లు
4. యూరీ – రూ. 360 కోట్లు
5. భారత్ – రూ. 325 కోట్లు
6. బిగిల్ – రూ. 306 కోట్లు
7. హౌజ్ ఫుల్ 4 – రూ. 295 కోట్లు
8. మిషన్ మంగళ్ – రూ. 290 కోట్లు
9. సైరా – రూ. 248 కోట్లు
10. గల్లీ బాయ్ – రూ. 23 కోట్లు