2019 మూవీ టీఆర్పీల్లో జీ తెలుగు హవా

Tuesday,December 31,2019 - 08:30 by Z_CLU

సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, స్మాల్ స్క్రీన్ పై కూడా మూవీస్ ఎలా నడుస్తున్నాయనేది ఇప్పుడు ఆడియన్స్ కు ఇంట్రెస్టింగ్ గా మారింది. క్రేజీ మూవీస్ కు సంబంధిన టీఆర్పీలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలా 2019లో కూడా కొన్ని సినిమాలు భారీ టీఆర్పీస్ తో అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. 2019లో హయ్యస్ట్ టీఆర్పీ చార్ట్స్ లో జీ తెలుగు హవా కొనసాగింది. టాప్-10లో ఏకంగా 5 సినిమాలు జీ తెలుగు ఛానెల్ నుంచి ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ నుంచి అరవింద సమేత వరకు చాలా సినిమాలు జీ తెలుగు ఛానెల్ లో హయ్యస్ట్ టీఆర్పీలు సాధించాయి. జీ తెలుగులో ప్రీమియర్స్ లో హయ్యస్ట్ టీఆర్పీ సాధించిన మూవీస్..


ఈ లిస్ట్ లో ఎఫ్2 (17.38) నంబర్ వన్ స్థానంలో నిలవగా.. రాక్షసుడు (9.84), సీత (9.83), నోటా (9.46), మహర్షి (8.99) సినిమాలకు టాప్-10 టీఆర్పీస్ లిస్ట్ లో స్థానం దక్కింది.