సౌత్ ఇండియా టాప్-10 సినిమాలు

Saturday,March 02,2019 - 03:48 by Z_CLU

ఒకప్పుడు భారీ వసూళ్లు సాధించాలంటే బాలీవుడ్ సినిమానే. ఎందుకంటే ఆ సినిమాలకు అంత రీచ్ ఉండేది. భాషతో సంబంధం లేకుండా ఆ హీరోలకు అంత క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అందుకే సౌత్ ఇండియన్ మూవీస్ కూడా కింగ్స్ అనిపించుకుంటున్నాయి. కలెక్షన్లలో బాలీవుడ్ కు సరికొత్త టార్గెట్స్ ఫిక్స్ చేస్తున్నాయి

బాహుబలి-2 సినిమా ఇప్పటికే బాలీవుడ్ జనాలకు చుక్కలు చూపించింది. ఆ మూవీ సాధించిన వసూళ్లు క్రాస్ చేయలేక ఖాన్ దాదాలు కిందామీదా పడుతున్నారు. కేవలం బాహుబలి-2 మాత్రమే కాదు, సౌత్ నుంచి ఎన్నో సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కళ్లుచెదిరే కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇప్పటివరకు సౌత్ నుంచి అత్యధిక వసూళ్లు (వరల్డ్ వైడ్ గ్రాస్) సాధించిన టాప్-10 సినిమాలివే.

1. బాహుబలి-2 – రూ. 1700 కోట్లు
2. 2.O – రూ. 667.64 కోట్లు
3. బాహుబలి-1 – రూ. 624.35 కోట్లు
4. రోబో – రూ. 348.93 కోట్లు
5. కబాలి – రూ. 334.52 కోట్లు
6. మెర్సెల్ (అదిరింది) – రూ. 254.70 కోట్లు
7. ఐ – రూ. 253.07 కోట్లు
8. సర్కార్ – రూ. 252.17 కోట్లు
9. కేజీఎఫ్ – రూ. 237.27 కోట్లు
10. పేట – రూ. 220.16 కోట్లు