ఓవర్సీస్ లో టాప్ 10 మూవీస్

Tuesday,May 22,2018 - 05:40 by Z_CLU

40 రోజుల షార్ట్ గ్యాప్ లో 3 బ్లాక్ బస్టర్స్ రావడంతో ఓనర్సీస్ టాప్-10 లిస్ట్ మారిపోయింది. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు మొదటి 2 స్థానాల్లో ఉన్నప్పటికీ.. రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలతో లిస్ట్ లో మార్పులు జరిగాయి.

ప్రస్తుతం ఓవర్సీస్ టాప్-5 లిస్ట్ లో భరత్ అనే నేను, రంగస్థలం సినిమాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 2 సినిమాల్లో ఏది ముందుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం రెండూ ఆడుతున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన క్లాసిక్ మూవీ మహానటి కూడా టాప్-10లో చేరింది. ప్రస్తుతం 8న స్థానంలో ఉన్న ఈ సినిమా.. మరికొన్ని రోజుల్లో ఖైదీ నంబర్ 150ని క్రాస్ చేయడం ఖాయం

ఓవర్సీస్ టాప్-10 సినిమాలు

 బాహుబలి 2  (2017) : $20,571,695

బాహుబలి  (2015 ) : $6,999,312

రంగస్థలం (2018) :  $3,513,328

భరత్ అనే నేను  (2018) :  $3,412,867

శ్రీమంతుడు  (2015)  :  $2,890,786

అ ఆ (2016)  :    $2,449,174

ఖైదీ నంబర్ 150 (2017) :    $2,447,043

మహానటి (2018) :   $2,254,952

ఫిదా  (2017)  : $2,066,419

అజ్ఞాతవాసి  (2018)   :  $2,065,028