ఈ ఏడాది టాప్-10 మూవీస్

Wednesday,August 02,2017 - 10:01 by Z_CLU

ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి-2 రికార్డులు సృష్టించింది. ఈ మూవీతో పాటు ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాలేంటో చూద్దాం.

బాహుబలి 2 : తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళిన సినిమా బాహుబలి 2. హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన ఈ సినిమా ఓవరాల్ గా 1,370 కోట్లు వసూలు చేసి హయ్యెస్ట్ గ్రాసర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

రయీస్ : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ రయీస్. రాహుల్ ఢొలాకియా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 184 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ లిస్టులో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

ట్యూబ్ లైట్ : సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్’ సినిమాపై రిలీజ్ కి ముందు నుండే భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. 1962 లో చైనా – ఇండియా వార్ ఆధారంగా, పీరియడ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా, 168 కోట్లు వసూలు చేసి థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో కొనసాగుతోంది. త్వరలోనే రయీస్ స్థానాన్ని ఆక్రమిస్తుందేమో చూడాలి.

జాలి LLB2 : అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఇమోషనల్ హిలేరియస్ ఎంటర్ టైనర్ జాలి LLB2. సుభాష్ కపూర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ లీగల్ సిస్టమ్ లో ఉన్న లొసుగుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, 162 కోట్లు వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది.

బద్రినాథ్ కి దుల్హనియా : వరుణ్ ధావన్, ఆలియా భట్ జంటగా నటించిన హిలేరియస్ ఎంటర్ టైనర్ బద్రినాథ్ కి దుల్హనియా. శశాంక్ ఖైతాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 160 కోట్లు వసూలు చేసి 5 వ స్థానం సంపాదించింది. ఈ సినిమాకి కరణ్ జోహర్ నిర్మాత.

ఖైదీ నం 150 : మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ… హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్, ఫుల్ టూ ఎగ్జైట్ మెంట్స్ మధ్య రిలీజైన ఈ సినిమా బాస్ ఈజ్ బ్యాక్ అనిపించింది. V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 140 కోట్లు వసూలు చేసి 6 వ స్థానంలో నిలిచింది.

కాబిల్ : హృతిక్ రోషన్, యామి గౌతమ్ జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ కాబిల్. సంజయ్ గుప్తా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, 132 కోట్లు వసూలు చేసి 7 వ స్థానంలో ఉంది.

The Fate Of The Furious: విన్ డీజిల్, డ్వాయిన్ జాన్సన్, జేసన్ స్టాటమ్ లాంటి స్టార్స్ నటించిన హాలీవుడ్ మూవీ The fate of the furious ఏప్రిల్ లో రిలీజైన ఇండియన్ సినిమాలకు ధీటుగా గట్టి పోటీనిచ్చింది. ఇండియాలో 123 కోట్లు వసూలు చేసిన ఈ స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 8 వ స్థానం దక్కించుకుంది.

దువ్వాడ జగన్నాథం : ఈ ఏడాది టాప్-10 హయ్యస్ట్ గ్రాసర్స్ లిస్ట్ లో డీజే కూడా స్థానం సంపాదించుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా 102 కోట్ల వసూళ్లతో 9 వ స్థానంలో కొనసాగుతోంది..

భైరవ : విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భైరవ. భరతన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, 82 కోట్ల వసూళ్లతో టాప్ 10 ప్లేస్ లో కొనసాగుతోంది.