స్పైడర్ టాప్ 10 హైలెట్స్

Tuesday,September 26,2017 - 11:03 by Z_CLU

మహేష్ కరియర్ లోనే బిగ్గెస్ట్ వెంచర్ స్పైడర్. 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజైంది. సూపర్ స్టార్ మహేష్ బాబును టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా ప్రజెంట్ చేసిన ఈ సినిమాకు మురుగదాస్ దర్శకుడు. టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో టాప్-10 హైలెట్స్ ఏంటో చూద్దాం.

మహేష్ బాబు : స్పైడర్ కు మెయిన్ ఎట్రాక్షన్ వన్ అండ్ ఓన్లీ మహేష్. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి మెయిన్ రీజన్ మహేష్. కెరీర్ లో ఫస్ట్ టైం ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా మహేష్ కనిపించాడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ కు జేమ్స్ బాండ్ టైపు సినిమాను తీసుకొచ్చాడు. మహేష్ లుక్స్ కు ఇప్పటికే ట్రమెండస్ రెస్పాన్స్ రావడంతో స్పైడర్ పై అంచనాలు రెట్టింపయ్యాయి.

A.R. మురుగదాస్: మహేష్ తర్వాత స్పైడర్ కు మెయిన్ ఎట్రాక్షన్ మురుగదాస్. మహేష్-మురుగదాస్ కాంబినేషన్ టాలీవుడ్ లో క్రేజీగా మారింది. మరీముఖ్యంగా కోలీవుడ్ లో స్పైడర్ తో లాంచ్ అయిన మహేష్ కు మురుగదాస్ లాంటి డైరక్టర్ ప్లస్ అయ్యాడు.

మ్యూజిక్: స్పైడర్ సినిమాకు మరో ఎట్రాక్షన్ మ్యూజిక్. తన సంగీతంతో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు హరీష్ జైరాజ్. స్పైడర్ కు కత్తిలాంటి పాటలిచ్చాడు. టైటిల్ సాంగ్ తో పాటు హాలీ హాలీ, సిసిలియా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక రీరికార్డింగ్ గురించే ఎంత చెప్పుకున్నా తక్కువే. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన స్పైడర్ కు తన రీరికార్డింగ్ తో ప్రాణంపోశాడు హరీష్.

మహేష్ – రకుల్ జోడీ : మహేష్ సరసన నటించాలనేది ప్రతి హీరోయిన్ డ్రీమ్. అలాంటి కలను స్పైడర్ సినిమాతో నెరవేర్చుకుంది రకుల్. వీళ్లిద్దరి జోడీ సినిమాలో మేజిక్ చేసింది. ట్రయిలర్ తోనే వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ జంట, సినిమాలో కలర్ ఫుల్ గా కనిపించింది.

కథ – స్క్రీన్ ప్లే : సినిమాకు ఎన్ని హంగులున్నా అంతా ఎదురుచూసేది కథ, స్క్రీన్ ప్లే గురించే. ఎందుకంటే ఇది మురుగదాస్ సినిమా. తన సినిమాల్లో అదిరిపోయే కథ, పరుగెత్తించే స్క్రీన్ ప్లేకు ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇస్తాడు మురుగదాస్. స్పైడర్ లో కూడా అదిరిపోయే కథ ఉంది. ఉత్కంఠ కలిగించే స్క్రీన్ ప్లే ఉంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చూస్తే హాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

సినిమాటోగ్రఫీ: వెండితెరపై విజువల్ వండర్ క్రియేట్ చేయాలంటే సినిమాటోగ్రాఫర్ చాలా కీలకం. ఈ విషయంలో స్పైడర్ యూనిట్ రిలీజ్ కు ముందే సూపర్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. తన వర్క్ తో అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్నాడు ఈ సినిమాటోగ్రాఫర్. స్పైడర్ లో సంతోష్ శివన్ మార్క్ విజువల్స్ ఆడియన్స్ ను  ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

గ్రాఫిక్స్: స్పైడర్ కు మరో మెయిన్ ఎట్రాక్షన్ గ్రాఫిక్స్. బాహుబలి-2 లాంటి విజువల్ వండర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. గ్రాఫిక్స్ పరంగా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంది యూనిట్. ఏకంగా 6 దేశాల్లో స్పైడర్ విజువల్ ఎఫెక్ట్స్ చేశారంటే గ్రాఫిక్స్ కు ఏ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థంచేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా హాస్పిటల్ ఎపిసోడ్, బండరాయి దొర్లుకుంటూ వచ్చే సన్నివేశాల్లో గ్రాఫిక్స్ అందర్నీ మెస్మరైజ్ చేస్తాయి.

ప్రొడక్షన్ వాల్యూస్ : కథ, స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కింది స్పైడర్ సినిమా. ఈ సినిమా కోసం ఏకంగా 190 రోజుల పాటు యూనిట్ అంతా కష్టపడింది. మరీ ముఖ్యంగా 70 రోజుల పాటు నైట్ షూటింగ్ చేశారు. చివరికి ఓ పాట కోసం ఆఖరి నిమిషంలో రొమేనియా కూడా వెళ్లారు. ఇక సినిమా కోసం హైదరాబాద్, చెన్నై, ముంబయిలో భారీ సెట్స్ నిర్మించారు. రోలర్ కోస్టర్ లో వచ్చే ఫైట్ షూటింగ్ కోసం హాంకాంగ్ వెళ్లారు. గ్రాఫిక్స్ కోసం అదే రోలర్ కోస్టర్ సెట్ ను చెన్నైలో నిర్మించారు. వీటి బట్టి ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత రిచ్ గా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

భారీ బడ్జెట్: ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండాలంటే ఖర్చుపెట్టాల్సిందే. ఈ విషయంలో స్పైడర్ నిర్మాతలు ఎక్కడా తగ్గలేదు. నిర్మాతలు ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్.. ఏకంగా 120 కోట్ల రూపాయల బడ్డెట్ తో స్పైడర్ నిర్మించారు. సినిమా చూస్తే ప్రతి ఫ్రేమ్ లో ఆ రిచ్ నెస్ కనిపిస్తుంది.

S.J సూర్య, భరత్: స్పైడర్ ఎట్రాక్షన్స్ లో ఎస్ జే సూర్య, భరత్ కు కూడా స్థానం దక్కుతుంది. దర్శకుడిగా బిజీగా ఉన్న ఎస్ జే సూర్య ఈ సినిమా ఒప్పుకున్నాడంటే, మరీ ముఖ్యంగా విలన్ గా కనిపించడానికి ఒప్పుకున్నాడంటే.. స్పైడర్ కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్ జే సూర్యతో పాటు మరో హీరో భరత్ కూడా ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించాడు. వీళ్లిద్దరు కూడా సినిమాకు హైలెట్.