టాప్-10 హీరోయిన్స్ 2017

Wednesday,December 27,2017 - 04:17 by Z_CLU

ఒక సినిమా హిట్ అయిందంటే హీరోకు ఎంత క్రేజ్ వస్తుందో.. సేమ్ టైం హీరోయిన్ కు కూడా అంతే డిమాండ్ పెరుగుతుంది. ఈ ఏడాది అలా క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు కొందరున్నారు. 2017 టాప్-10 హీరోయిన్స్ ఎవరో చూద్దాం

 

టాప్-10 లిస్ట్ లో అందరికంటే ముందున్న హీరోయిన్ అనుష్క. ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ 3 సినిమాలు చేసింది. వాటిలో చరిత్ర సృష్టించిన బాహుబలి-2 కూడా ఉంది. అందుకే 2017 హీరోయిన్ల లిస్ట్ లో అనుష్క ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

 

ఈ ఏడాది క్రేజీ భామల్లో పూజా హెగ్డే పేరు టాప్ లిస్ట్ లో చేరిపోయింది. డీజే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఈమెను ఎవరూ పట్టించుకోలేదు. ఆ మూవీ రిలీజ్ తర్వాత ఈమెను పట్టించుకోని డైరక్టర్ లేడు. అందరికీ ఈమె కావాలి. అలా ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోతుంది పూజా హెగ్డే.

 

దాదాపు రెండేళ్లుగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్, 2017లో కూడా తన సత్తా చాటింది.  ఈ ఏడాది నాలుగు సినిమాలు చేసింది రకుల్. వీటిలో భారీ బడ్జెట్ మూవీ స్పైడర్ తో పాటు జయజానకి నాయక, ఖాకి, విన్నర్ సినిమాల్లో నటించింది రకుల్.

 

మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్రేజీ హీరోయిన్ సమంత కూడా ఈ ఏడాది టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉంది. కాకపోతే ఈ ఏడాది ఆమె తెలుగులో ఒకే సినిమా చేసింది. మామగారు నాగార్జున నటించిన రాజుగారి గది-2 సినిమాతో పాటు అదిరింది, 10 అనే రెండు డబ్బింగ్ మూవీస్ లో నటించింది.

 

కీర్తిసురేష్ ఈ ఏడాది 2 సినిమాలు చేసింది. వాటిలో ఒకటి డబ్బింగ్ మూవీ అయితే, ఇంకోటి స్ట్రయిట్ సినిమా. నానితో కలిసి కీర్తి చేసిన నేను లోకల్ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక తమిళ్ లో విజయ్ సరసన ఆమె నటించిన ఓ సినిమా ఏజెంట్ భైరవ పేరుతో తెలుగులో విడుదలైంది.

 

అనుపమ పరమేశ్వరన్… టాలీవుడ్ లో ఓ రేంజ్ లో మెరిసిన ముద్దుగుమ్మ. శతమానం భవతి లాంటి క్లీన్ మూవీతో ఈ ఏడాది బోణీకొట్టిన ఈ బ్యూటీ.. రామ్ సరసన ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో పాటు దుల్కర్ హీరోగా అందమైన జీవితం అనే సినిమా చేసింది. అలా 3 సినిమాలతో లైమ్ లైట్లో నిలిచింది అనుపమ.

 

2017లో మెరిసిన మరో ముద్దుగుమ్మ మెహ్రీన్. రాజా ది గ్రేట్, మహానుభావుడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మెహ్రీన్.. అదే ఊపులో కేరాఫ్ సూర్య, జవాన్ సినిమాల్లో కూడా నటించి, ఈ ఏడాది 4 సినిమాలు ఖాతాలో వేసుకుంది.

 

జెంటిల్ మేన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన హీరోయిన్ నివేత థామస్. ఈ ఏడాది నిన్ను కోరి సినిమాతో మరో సక్సెస్ కొట్టింది ఈ మలయాళీ బ్యూటీ. ఈ మూవీతో పాటు ఎన్టీఆర్ సరసన నివేత నటించిన జై లవకుశ పెద్ద హిట్ అయింది. రీసెంట్ గా ఆమె నటించిన జూలియట్ లవర్ ఆఫ్ ఇడియన్ అనే మరో సినిమా కూడా రిలీజైంది.

 

సాయిపల్లవి.. ఈ ఇయర్ సెన్సేషనల్ హీరోయిన్ ట్యాగ్ లైన్ కచ్చితంగా ఈమెకే ఇవ్వాలి. ఫిదా సినిమాతో ఓ కెరటంలా దూసుకొచ్చింది సాయిపల్లవి. ఆ సినిమా సక్సెస్ తర్వాత నానితో కలిసి ఎంసీఏ మూవీ చేసింది. ఈ రెండు సినిమాల మధ్యలో హేయ్ పిల్లగాడా అనే మరో డబ్బింగ్ సినిమాతో కూడా కనిపించింది సాయిపల్లవి.

 

అర్జున్ రెడ్డి సినిమాతో ఈ ఏడాది టాలీవుడ్ కు దొరికిన మరో బ్యూటిఫుల్ & టాలెంటెడ్ హీరోయిన్ షాలినీ పాండే. ఆ ఒక్క సినిమాతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది షాలిని. కొత్త ఏడాదిలో మరికొన్ని తెలుగు సినిమాలతో మెరవనుంది.