క్యూరియాసిటీ రేజ్ చేస్తున్న ‘మిషన్ ఇంపాసిబుల్ – ఫాలౌట్’

Friday,July 20,2018 - 10:03 by Z_CLU

ఈ నెల 27 న రిలీజ్ కి రెడీ అవుతున్న టాలీవుడ్ సినిమాలతో పాటు టామ్ క్రూస్ నటించిన హాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మిషన్ ఇంపాసిబుల్ – ఫాలౌట్’ కూడా ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సక్సెస్ ఫుల్ సిరీస్ లో వచ్చిన గత సినిమాల కంటే ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పుకున్నాడు టామ్ క్రూస్. గతంలో టామ్ క్రూస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘జాకీ రిచర్’ కి దర్శకత్వం వహించిన మెక్ క్వారీ ఈ సినిమాకు దర్శకత్వం చేశాడు.

మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లోని ప్రతి సినిమా ప్రత్యేకమే. దానికి కారణం ఈ సిరీస్ లోని ప్రతి సినిమాకు డిఫెరెంట్ డైరెక్టర్ పని చేస్తాడు. అయితే ఈ సారి ఈ ‘మిషన్ ఇంపాసిబుల్ – ఫాలౌట్’ మరింత స్పెషల్ గా ప్రెజెంట్ గా చేయడానికి మెక్ క్వారీ ఏరికోరి ఎంచుకున్నాడు టామ్ క్రూస్. ఆ స్టాండర్డ్స్ ఈ సినిమా ట్రైలర్ లో క్లియర్ గా తెలుస్తున్నాయి.

 

పారామౌంట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాని ఇండియాలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.