టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్స్

Thursday,February 28,2019 - 06:32 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది విజయ్ దేవరకొండ సినిమా. ఇక్కడ టాపిక్ డియర్ కామ్రేడ్ గురించి కాదు, విజయ్ దేవరకొండ స్వయంగా నిర్మిస్తున్న సినిమా. తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వరస సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు యంగ్ ప్రొడ్యూసర్ గా కూడా కరియర్ బిగిన్ చేశాడు ఈ హీరో. ‘కింగ్ ఆఫ్ హిల్స్’ బ్యానర్ పై వరసగా మరిన్ని సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నాడు. ఇలా ఈ వరసలో మరింత మంది యంగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు.

నాని : రీసెంట్ గా ‘అ!’ సినిమా నిర్మించి టేస్ట్ ఉన్న నిర్మాత అనిపించుకున్నాడు. ‘వాల్ పోస్టర్’ బ్యానర్ పై ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా ఇంకో సినిమా అనౌన్స్ కాలేదు కానీ, దిల్ రాజు తో కలిసి మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమాని నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. నిర్మాతగా ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న ఈ యంగ్ ప్రొడ్యూసర్, కాస్త గ్యాప్ ఇచ్చైనా మంచి సినిమాతో రావాలనే ప్లానింగ్ లో ఉన్నాడు.

 సుధీర్ బాబు : ఫస్ట్ సినిమాకే క్వాలిటీ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘నన్ను దోచుకుందువటే’ సినిమాని నిర్మించి, ఫస్ట్ సినిమాకే సరిపడా సక్సెస్ ని అందుకున్నాడు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఈ బ్యానర్ పై మరో 2 సినిమాలు తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే  ఈ 2 సినిమాలతో మరో ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్నాడు ప్రొడ్యూసర్ సుధీర్ బాబు.

 సందీప్ కిషన్ : ఓ వైపు హీరోగా గట్టి సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ‘నిను వీడని నేనే’ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు సందీప్ కిషన్. ‘వెంకటాద్రి టాకీస్’ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మ్యాగ్జిమం ఈ సమ్మర్ లోనే సినిమాని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు ఈ యంగ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా సక్సెసయితే, సందీప్ కిషన్ నిర్మాతగా మరిన్ని సినిమాలు వస్తాయి.

 

 విశ్వక్ సేన్ : గతంలో వెళ్ళిపోమాకే సినిమాలో తరవాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో నటించి పర్వాలేదు, బాగానే పర్ఫామ్ చేశాడు అనిపించుకున్నాడు. కానీ ఆ తరవాత డైరెక్ట్ గా ‘ఫలక్ నుమా దాస్’ సినిమాకి డైరెక్షన్ బిగిన్ చేశాడు. ఓకె అసలు ప్లానింగ్ డైరెక్షనా..? అని రియలైజ్ అయ్యే లోపు ఈ సినిమాకి విశ్వక్ సేన్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని తెలిసింది. ‘విశ్వక్ సేన్ సినిమాస్’ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

 కాజల్ : ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం కానున్న యంగ్ అండ్ గ్లామరస్ ప్రొడ్యూసర్. K.A. వెంచర్స్ అనే బ్యానర్ పై సినిమాల్ని నిర్మించనుంది కాజల్. ఇప్పటికే ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట కాజల్. అంతేనా ఈ సినిమాలో తనే నటిస్తుంది కూడా. ఈ సినిమాలో బ్యాలన్స్ ఉన్నదల్లా అఫీషియల్ అనౌన్స్ మెంటే. అయితే ఈ బ్యానర్ కి కాజల్ క్లోజ్ ఫ్రెండ్ తమన్నా కూడా కొ – ప్రొడ్యూసర్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది.

రామ్ చరణ్ : ఇక మన మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నం 150’ తోనే ప్రొడ్యూసర్ గా మారాడు రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇప్పుడు ‘సైరా’ కూడా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తరవాత అఖిల్ సినిమా కూడా ఈ బ్యానర్ పై తెరకెక్కనుందని తెలుస్తుంది.

 మహేష్ బాబు : ఈ వరసలో మహేష్ బాబు కూడా ఉన్నాడు. గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేశాడు. ఇప్పుడు ‘GMB – మహేష్ బాబు ఎంటర్టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ పై ‘మేజర్’ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ మరిన్ని సినిమాలను నిర్మించే ప్రాసెస్ లో ఉన్నాడు మహేష్ బాబు.

అల్లు అర్జున్ : ఈ వరసలో త్వరలో అల్లు అర్జున్ కూడా చేరనున్నాడు. ప్రొడ్యూసర్ గా మారడానికి ఆల్రెడీ ఫిక్సయిన స్టైలిష్ స్టార్, త్వరలో కొత్త బ్యానర్ తో పాటు, సినిమాని కూడా అనౌన్స్ చేస్తాడు.