న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏ స్టార్ ఎక్కడ?

Tuesday,December 31,2019 - 03:05 by Z_CLU

టాలీవుడ్ స్టార్స్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి డెస్టినేషన్ ఇప్పటికే ఫిక్సయ్యారు. కొంతమంది ఆల్రెడీ బ్రేక్ తీసుకుని  మరీ అక్కడకి వెళ్ళిపోతే.. మరికొందరు వెళ్ళే ప్రిపరేషన్స్ లో ఉన్నారు. ఇంతకీ ఈ స్టార్స్ ఎక్కడెక్కడ న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారంటే…

అల్లు అర్జున్ : రీసెంట్ గా ‘అల…’ షూటింగ్ కూడా ప్యాకప్ అవ్వడంతో.. ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే గ్యాప్ లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి  బ్యాంకాక్ వెళ్ళాడు. ఫ్యామిలీతో   కలిసి ఈ టూర్ ప్లాన్ చేసుకున్న బన్ని, జనవరి ఫస్ట్ వీక్ తరవాత ఇండియా వస్తాడు. ఆ తరవాత సినిమాని ప్రమోట్ చేస్తాడు.

చైతు – సమంతా : ఇప్పటికే ‘గోవా’ చేరుకుంది సమాంత. ఈ రోజో, రేపో నాగచైతన్య కూడా గోవా వెళ్ళబోతున్నాడు. ఇద్దరికీ ఇది మోస్ట్ ఫేవరేట్ డెస్టినేషన్ మరీ.

శ్రద్ధాదాస్ : ఈ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని ప్రొఫెషనల్ గా ప్లాన్ చేసుకుంది శ్రద్ధాదాస్. ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్ లో లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనుంది.

రష్మిక మండన్న : ఆల్రెడీ ‘రోమ్’ లోనే ఉంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అయ్యాక కానీ, ఇండియాకి రాదు. ఆ తరవాతే ‘సరిలేరు…’ ప్రమోషన్స్.

శ్రియ : బార్సిలోనా లో ఉంటుంది శ్రియ. అయితే న్యూ ఇయర్ కి మాత్రం రష్యా కి వెళ్తుంది. రష్యాలోని ఎగ్జోటిక్ లొకేషన్స్ లో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పనుంది.

నిక్కీ తంబోలి : ఆల్రెడీ దుబాయ్ లో ఉంది. సోషల్ మీడియాలో ఈ వెకేషన్ కి సంబంధించిన విషయాల్ని  ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్న నిక్కీ… న్యూ ఇయర్ వేడుకల్ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటుంది.