షూటింగ్ అప్ డేట్స్

Thursday,June 14,2018 - 11:03 by Z_CLU

రామ్ చరణ్ – బోయపాటి సినిమా

మెగా పవర్ స్టార్… డైరెక్టర్  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో  పవర్ ప్యాకెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా షెడ్యూల్  ఈరోజు నుండి ప్రారంభమైంది.  కోకాపేట్ లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో ఈ షూటింగ్  జరగుతుంది. ఇటివలే బ్యాంకాక్ లో భారీ షెడ్యుల్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నెలాఖరు వరకూ హైదరాబాద్ లో షెడ్యూల్ జరుపుకోనుందని సమాచారం. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

 

నితిన్ – శ్రీనివాస కళ్యాణం 

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నితిన్ నటిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్ ప్రస్తుతం అమలాపురం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. మొన్నటి వరకూ  నితిన్ -రాశి ఖన్నా- నందిత శ్వేతా ఇతర నటీ నటులపై కొన్ని సీన్స్  షూట్ చేసిన యూనిట్ ఇప్పుడు పెళ్లి సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. మరో వారం పాటు జరగనున్న ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ ప్యాకప్ చెప్పనున్నారు యూనిట్. ఆగస్ట్ 9 న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు మిక్కీ జే.మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

శర్వానంద్ –  పడి పడి లెచే మనసు

శర్వానంద్, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ‘పడి పడి లెచే మనసు’ షూటింగ్ ప్రస్తుతం కల్ కత్తా లో జరగుతుంది.. ఇప్పటికే కల్ కత్తాలో ఒక లాంగ్ షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో శర్వానంద్ సాయి పల్లవి పై కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారు. తర్వాత నేపాల్ లో మరో షెడ్యూల్ జరుపుకోనుందీ సినిమా.

 

రామ్ – హలో గురు ప్రేమ కోసమే 

ఇప్పటికే రెండు షెడ్యూల్ ఫినిష్ చేసుకుందీ రామ్ ‘హలో గురు ప్రేమ కోసమే’… ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మూడో షెడ్యూల్ కాకినాడలో జరుగుతుంది. ఇటివలే చిన్న బ్రేక్ తీసుకున్న యూనిట్ మళ్ళీ బ్యాక్ టు షూట్ మోడ్ లోకి వచ్చేసింది. దాదాపు 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో  రామ్, ప్రకాష్ రాజ్, ఆమని, సితార తదితరులపై కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు యూనిట్.

 

కళ్యాణ్ దేవ్ – విజేత 

కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న ‘విజేత’ సినిమా ఒక సాంగ్ మినహా టాకీ పార్ట్ ఫినిష్ చేసుకుంది. ప్రస్తుతం బ్యాలెన్స్ సాంగ్ ను అల్యూమినియం ఫాక్టరీలో షూట్ చేస్తున్నారు యూనిట్. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సాంగ్ షూట్ తో టోటల్ షూటింగ్ ఫినిష్ కానుంది. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. జులై 6 న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.