Tollywood Re-Release - మళ్లీ తెరపైకి క్రేజీ సినిమాలు!

Wednesday,June 16,2021 - 02:11 by Z_CLU

త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ తొలగించే పరిస్థితి కనబడుతుంది. త్వరలోనే 50% ఆక్యూపెన్సీతో సినిమా హాళ్ళకి పర్మీషణ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి ప్రభుత్వాలు. జులై మొదటి వారం నుండి మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవ్వనున్నాయని సమాచారం. దీని కోసం థియేటర్స్ రెడీ అవుతున్నాయి. వచ్చే వారం నుండి సినిమా హాళ్ళను క్లీన్ చేసి సానిటైజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు ఎగ్జిబ్యూటర్స్.

ముందుగా ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన సినిమాలను రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఎగ్జిబ్యూటర్లు. ఇప్పటికే నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబ్యూటర్స్ మధ్య కొన్ని ఆన్ లైన్ మీటింగ్ కూడా జరిగాయట. తాజాగా వైజాగ్ జగదాంబ థియేటర్ లో ఒకరోజు క్రాక్ సినిమాను ప్రదర్శించారు. పర్మీషణ్ లేని కారణంగా మళ్ళీ ప్రదర్శన ఆపేశారు. సో రీ రిలీజ్ లో ఉన్న మంచి ఆప్షన్స్ లో క్రాక్ , వకీల్ సాబ్, ఉప్పెన , జాతి రత్నాలు కనిపిస్తున్నాయి. మరి వీటితో ప్రేక్షకులు మళ్ళీ థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూస్తారా ? అనేది తెలియాల్సి ఉంది.

Pawan vakeelsaab working stills anjali ananya nivetha venu sriram
ఈ నాలుగు సినిమాలతో రెండు మూడు వారాలు థియేటర్స్ నడిపించే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వాలు పర్మీషణ్ ఇవ్వగానే 50 ఆక్యుపెన్సీ తో సినిమాలు రన్ అవుతాయి. ఆ తర్వాత నాగ చైతన్య ‘లవ్ స్టోరి’, నాని ‘టక్ జగదీశ్’, రానా విరాట పర్వం సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజైన కొన్ని రోజులకి చిరంజీవి , బాలయ్య , వెంకటేష్ నటించిన బడా సినిమాలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics