Tollywood - జులై వరకు రిలీజెస్ లేనట్టే!

Saturday,April 24,2021 - 05:03 by Z_CLU

సెకెండ్ వేవ్ లో కరోనా మరోసారి టాలీవుడ్ ను దెబ్బకొట్టింది. కొంతమంది కరోనా బారిన పడ్డారు. మరికొంతమంది క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇక సినిమాలైతే మరోసారి అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే.. ఇండస్ట్రీలో మరో 2 నెలల వరకు పెద్ద సినిమాలేవీ రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ఈపాటికి లవ్ స్టోరీ థియేటర్లలోకి రావాలి. టక్ జగదీష్ కూడా లెక్కప్రకారం నిన్ననే రిలీజ్ అవ్వాల్సి ఉంది. మరోవైపు విరాటపర్వం సినిమా ప్రచారం పీక్ స్టేజ్ లో జరగాల్సింది. కానీ అవేం జరగలేదు. అన్ని పనులు ఎక్కడివక్కడ ఆపేశారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సినిమాలతో పాటు ఆచార్య, అఖండ, ఖిలాడీ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.

love story nagachaitanya sai pallavi

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఇలా వాయిదా పడిన సినిమాలన్నింటినీ జులై/ఆగస్ట్ లో థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు నిర్మాతలు. మరి ఆ నెలల్లో షెడ్యూల్ అయిన సినిమాల సంగతేంటి?

కేజీఎఫ్2, రాధేశ్యామ్, ఆచార్య, నారప్ప లాంటి పెద్ద సినిమాలు ఆ నెలల్లో థియేటర్లలోకి రావాలి. ఆ మేరకు ఆ సినిమాలు కూడా ఇంకాస్త వెనక్కి వెళ్లాయి. ఈ సినిమాలన్నీ అక్టోబర్/నవంబర్ నెలల్లో థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

akhanda movie balakrishna 2

అయితే ఇవన్నీ ప్లాన్స్ మాత్రమే. సెకెండ్ వేవ్ లో కరోనా ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందనేది అప్పుడే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మెడికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం మే నెలలో వైరస్ పీక్ స్టేజ్ లో ఉంటుందని, జూన్ లో తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం జులైలో కూడా వైరస్ ప్రభావం కొనసాగే ప్రమాదం ఉందంటున్నారు. సో.. వైరస్ ఎన్నాళ్లు ఉంటుందనే దానిపై సినిమాల రిలీజెస్ డిపెండ్ అయి ఉంటాయి.

ఈసారి గమనించదగ్గ విషయం ఏంటంటే.. సినిమాలేవీ ఓటీటీ వెంట పడడం లేదు. గతేడాది కరోనా వచ్చినప్పుడు ఓ మోస్తరు సినిమాలతో పాటు V, నిశ్శబ్దం లాంటి పెద్ద సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అయితే ఈసారి మాత్రం సెకెండ్ వేవ్ గట్టిగా తగిలినప్పటికీ.. పెద్ద నిర్మాతలెవ్వరూ డైరక్ట్ ఓటీటీ రిలీజ్ ఆలోచన చేయడం లేదు. థియేటర్లలో పెద్ద సినిమాలకు రెస్పాన్స్ బాగుండడంతో ఎన్నాళ్లైనా వెయిట్ చేయాలని అటు నిర్మాతలు, ఇటు హీరోలు ఫిక్స్ అయ్యారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics