టాలీవుడ్ కొత్త దర్శకులు - 2017

Wednesday,December 27,2017 - 08:01 by Z_CLU

స్టార్ డైరక్టర్లు హిట్ కొట్టడం కామన్. అప్పుడే ఇండస్ట్రీకొచ్చి ఫస్ట్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయడం వెరైటీ. ప్రతి ఏటా ఇలాంటి స్టన్నింగ్ డైరక్టర్లు పుట్టుకొస్తూనే ఉంటారు. 2017లో కూడా అలాంటి దర్శకులు కొందరున్నారు. ఈ ఏడాది అలా మొదటి సినిమాతో మైమరిపించిన దర్శకులెవరో చెక్ చేద్దాం.

‘అర్జున్ రెడ్డి’ తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.. రిలీజ్ కి ముందే టీజర్ తో సంచలనం సృష్టించిన సందీప్.. మూవీ రిలీజ్ అయ్యాక హాట్ టాపిక్ గా మారాడు. ఆస్ట్రేలియాలో ఫిలిం టెక్నాలజీలో ట్రయినింగ్ తీసుకున్న సందీప్.. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ స్టయిల్ నే మార్చేశాడు. అప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులు చూడని బోల్డ్ సీన్స్ తో ఓ లవ్ స్టోరీ ని ప్రజెంట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ సినిమా తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది.

‘ఘాజీ’ సినిమాతో ఈ ఏడాది టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు  సంకల్ప్ రెడ్డి. ట్రైలర్ తోనే తానేంటో నిరూపించుకున్న సంకల్ప్ రిలీజ్ తర్వాత కమర్షియల్ సక్సెస్ తో పాటు క్రిటిక్స్ మెప్పు పొందాడు. మూవీ మేకింగ్ లో ఎలాంటి అనుభవం లేకపోయినా తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కట్టిపడేశాడు. నిజానికి అప్ కమింగ్ డైరెక్టర్స్ కమర్షియల్ సినిమాతోనే వెండితెరకు పరిచయం అవ్వాలనుకుంటారు.. కానీ సంకల్ప్ మాత్రం మొదటి సినిమాతోనే తన రూటే సెపరేటు అని చెప్పాడు.

ఓ చిన్న సినిమాకు పెద్ద బజ్ రావడం అంటే మాటలు కాదు. మూవీ కంటెంట్ లో ఎంతో దమ్ముండాలి. ప్రమోషన్ లో కొత్తదనం చూపించాలి. మరీ ముఖ్యంగా టైటిల్ క్యాచీగా ఉండాలి. ఈ అన్ని ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేస్తూ వెంకటాపురం సినిమా తీసి హిట్ కొట్టాడు దర్శకుడు వేణు మడికంటి. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు డిఫరెంట్ థ్రిల్లర్ కంటెంట్ ను చూపించాడు.

విక్టరీ వెంకటేష్ ని ఇప్పటివరకు ఎవరూ ఇలా చూడలేదు. ఇలాంటి పాత్రను వెంకీ చేస్తాడని కూడా ఊహించలేదు ఫ్యాన్స్. అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ లో వెంకీని మోస్ట్ పవర్ ఫుల్ గా చూపించి తెలుగుతెరకు పరిచయమైంది డైరక్టర్ సుధా కొంగర. తమిళ్, హిందీలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాను ఇక్కడ గురు పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టింది.

మనసులో ఉన్న ఫీలింగ్స్ ను యాజ్ ఇటీజ్ గా తెరపై పెడితే హిట్ గ్యారెంటీ. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. నిన్ను కోరి అనే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో టాలీవుడ్ ఆడియన్స్ ను కట్టిపడేశాడు. అలా తన మొదటి సినిమాతోనే సెన్సేబుల్ డైరక్టర్ అనిపించుకున్నాడు శివ నిర్వాణ.

మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని, సినీ ప్రముఖుల నుంచి ప్రశంశలు దక్కించుకోవాలని ప్రతీ దర్శకుడికీ ఓ కల ఉంటుంది… కానీ ఇటివలే ఆ కళను ‘మెంటల్ మదిలో’ సినిమాతో నెరవేర్చుకొని టాలీవుడ్ లో చిన్న సైజు హాట్ టాపిక్ అయ్యాడు వివేక్ ఆత్రేయ. కన్ఫ్యూజన్ డోస్ ఎక్కువ ఉండే హీరో క్యారెక్టర్ తో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమా తీసి తన టాలెంట్ ఏంటో చూపించాడు.

ఈ ఏడాది చివర్లో ‘మళ్ళీ రావా’ సినిమాతో  టాలీవుడ్ బెస్ట్ డెబ్యూ డైరక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు గౌతమ్ తిన్ననూరి. దాదాపు చాలా ఏళ్ళ నుంచి ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్న సుమంత్ కి ‘మళ్ళీ రావా’ రూపం లో ఓ హిట్ అందించాడు. చేసింది లవ్ స్టోరీనే అయినప్పటికీ తనదైన స్టయిల్ లో డిఫరెంట్ గా ప్రజెంట్ చేసి సక్సెస్ కొట్టాడు గౌతమ్.