Tollywood - షూటింగ్ అప్ డేట్స్

Saturday,September 25,2021 - 12:42 by Z_CLU

సెకండ్ వేవ్ కరంగా వాయిదా పడిన కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటున్నాయి. స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకూ అందరూ షూటింగ్స్ తో బిజీ గా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ విశేషాలు మీ కోసం.

chiranjeevi godfather
‘ఆచార్య’ తర్వాత మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాథర్’ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. నేటి నుండి ఊటీ షెడ్యుల్ మొదలు పెట్టారు యూనిట్. ఇటివలే హైదరబాద్ లో జైలు సెట్ వేసి కొన్ని సన్నివేశాలు తీశారు. ఇప్పుడు ఊటి లో రెండో షెడ్యుల్ మొదలైంది. ఈ షెడ్యుల్ లో చిరు మిగతా నటీ నటులపై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్ లో సురేఖ కొణిదెల సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బేనర్ పై NV ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్.

akhanda movie balakrishna 2
నందమూరి నటసింహం బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అఖండ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. ఒక పాట మినహా టోటల్ షూటింగ్ పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం గోవాలో ఆ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. వారం రోజుల పాటు అక్కడే షూట్ జరగనుంది. హైదరబాద్ తిరిగి వచ్చాక సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ద్వారక క్రియేషన్స్ బేనర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ , పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Mahesh-trivikram

త్రివిక్రమ్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #SSMB28 సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మొదటి షెడ్యుల్ లో ఒక పాట ను అలాగే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసే ఆలోచనలో ఉన్నారట. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. హారికా & హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాదా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

f3 movie
విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘F3’ షూటింగ్ హైదరబాద్ లో జరుగుతుంది. మొన్నటి వరకు సారదీ స్టూడియోస్ లో కొన్ని సన్నివేశాలు షూట్ చేసిన యూనిట్ ప్రస్తుతం సిటీ అవుట్ స్కర్ట్స్ లో మరికొన్ని సీన్స్ తీస్తున్నారు. ఈసారి వెంకీ , వరుణ్ ల కామెడీతో పాటు సునీల్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అవుతుందని యూనిట్ అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తమన్నా , మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

liger vijay deverakonda

పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్నా ‘ లైగర్ ‘ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. గోవాలో వేసిన సెట్ లో ప్రస్తుతం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నాడు పూరి. దాదాపు మరో పది రోజుల పాటు షూట్ జరగనుందని తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలా కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics