బ్లాక్ అండ్ వైటే సో బెటరూ...!

Wednesday,January 02,2019 - 01:19 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్తదనం చాలా కామన్. మరీ ట్రెండ్ ఒకే మూసలో నడుస్తుందా..? అనిపించడమే ఆలస్యం, ఏదో కొత్తదనం తీసుకొచ్చి పెడతారు ఫిల్మ్ మేకర్స్.   అలా  బిగిన్ అయిందే   బ్లాక్ & వైట్ క్లాసిక్ పీరియడ్ ని కలర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసే ట్రెండ్. రీసెంట్ గా  ‘రంగస్థలం’  ఇలా  సక్సెస్ అయిందో లేదో, దర్శకులు వెనక్కి వెళ్ళి మరీ నచ్చిన ఇయర్ ని సెలెక్ట్ చేసుకుని  కథలు రాసుకుంటున్నారు.

సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న నాని ‘జెర్సీ’ కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతుంది. మరోవైపు సమంతా, నాగ చైతన్య జతగా తెరకెక్కుతున్న ‘మజిలీ’ 1996 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.

ఈ వరసలో రాజశేఖర్ ‘కల్కి’ కూడా 1980 బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతుంది. ఇక కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కనున్న సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘చిత్రలహరి’, రానా ‘విరాటపర్వం’, శర్వా – సుధీర్ వర్మ ల సినిమాతో పాటు రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న  ప్రభాస్  సినిమా కూడా పీరియాడిక్    డ్రాప్ లోనే ఉండటం విశేషం.

వీటికి తోడు వరసగా తెరకెక్కి రిలీజ్ అవుతున్న బయోపిక్స్, ఈ ట్రెండ్ ని మరింత స్ట్రాంగ్ చేస్తున్నాయి. ఏది ఏమైనా క్లాసిక్ అనిపించుకున్న టైమ్ పీరియడ్ ని సిల్వర్ స్క్రీన్ పై  మరిన్ని  కలర్స్ తో   ప్రెజెంట్ చేస్తూ,     యూత్ కి కనెక్ట్ అవుతున్న మేకర్స్, పనిలో పనిగా సీనియర్ ఆడియెన్స్ ని కూడా థియేటర్స్ కి రప్పించడం లో సక్సెస్ అవుతున్నారు.