మేలో మూవీ ఫెస్టివల్

Sunday,March 22,2020 - 10:24 by Z_CLU

కరోనా ఎఫెక్ట్ తో మార్చ్, ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా పోస్ట్ పోన్ అవుతున్న సంగతి తెలిసిందే. నాని, సుదీర్ బాబు చేసిన ‘V’ నుండి ఏప్రిల్ లో  రిలీజ్ కావాల్సిన మిగతా సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు మేకర్స్. అయితే కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన సినిమాలన్ని మేలో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

మేలో ఎటు లేదన్నా వారానికి రెండు, మూడు సినిమాలు చొప్పున వరుసగా సమ్మర్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ లాస్ట్ వీక్ లో సినిమాలు రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా విరమించుకున్నారట నిర్మాతలు.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిన సినిమాలన్నీ మే మొదటి వారం నుండి థియేటర్లలోకి వస్తాయి. షూటింగ్ డిలే వల్ల మేలో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఇంకాస్త ఆలస్యంగా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా మే నెల నుంచి సినిమా రిలీజ్ డేట్స్ సర్దుబాటు అవుతాయి.