టాలీవుడ్ మార్చి నెల బాక్సాఫీస్ రివ్యూ

Monday,April 01,2019 - 05:30 by Z_CLU

టాలీవుడ్ లో మార్చి నెల ఎప్పుడూ డిసప్పాయింట్ మెంట్ తప్పదు. ఎందుకంటే అది ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి పెద్ద సినిమాలు రావు. బాక్సాఫీస్ స్తబ్దుగా మారిపోతుంది. ఈ ఏడాది మార్చి కూడా అలానే ఉంది.  ఎగ్జాట్ గా 25 సినిమాలు రిలీజ్ అయితే ఒక్కటి తప్ప అన్నీ నష్టాలతోనే ముగిశాయి.

 మొదటి వారంలో 118, విశ్వాసం, క్రేజీ క్రేజీ ఫీలింగ్, గన్ షాట్ సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో కల్యాణ్ రామ్ నటించిన ‘118’ మాత్రమే బ్రేక్-ఈవెన్ అయింది. మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అజిత్ నటించిన ‘విశ్వాసం’ సినిమా కోలీవుడ్ లో ఆల్ టైమ్ హిట్ అయింది కానీ టాలీవుడ్ లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.

ఇక సెకెండ్ వీకెండ్ లో ‘సర్వం తాళమయం’, బొట్టు, లవ్ గేమ్, మరో అడుగు మార్పు కోసం, కెప్టెన్ మార్వెల్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒక్క సినిమా కూడా ఆడలేదు. అలా సెకెండ్ వీక్ మొత్తం బాక్సాఫీస్ డల్ గా నడిచింది.

థర్డ్ వీకెండ్ లో ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’, ‘ప్రాణంఖరీదు’, ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’, ‘జెస్సీ’, ‘మౌనమే ఇష్టం’, ‘మ్యాగ్నెట్’ సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. కనీసం యావరేజ్ మార్క్ కూడా అందుకోలేదు. వీటిలో రాయ్ లక్ష్మీ నటించిన వేర్ ఈజ్ వెంకటలక్ష్మికి ఓపెనింగ్ డే మంచి కలెక్షన్ వచ్చింది కానీ తర్వాత పుంజుకోలేకపోయింది.

 ఇక నాలుగో వారంలో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘పులిజూదం’, ‘వినరా సోదర వీరకుమార’, ‘ప్రేమతో చెప్పనా’, ‘చెడ్డీ గ్యాంగ్’, ‘కమాల్’ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో రెవెన్యూ పరంగా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమా మాత్రమే సక్సెస్ అయింది. బి, సీ సెంటర్లలో దీనికి బ్రహ్మాండమైన కలెక్షన్లు వచ్చాయి.

 మార్చి లాస్ట్ వీకెండ్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘సూర్యకాంతం’, ‘ప్రేమ అంత ఈజీ కాదు’, ‘ఐరా’ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో లక్ష్మీస్ ఎన్టీఆర్, సూర్యకాంతం మాత్రమే కాస్త బజ్ తో నడుస్తున్నాయి. మిగతావన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇలా మార్చి నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డల్ అయింది.