స్పీడందుకున్న రీమేక్స్

Wednesday,February 20,2019 - 10:03 by Z_CLU

టాలీవుడ్ లో రీమేక్ సీజన్ కొత్తగా వచ్చిందేమీ కాదు ఎప్పటి నుండో ఉంది. కాకపోతే ఇప్పుడు మరింత స్పీడందుకుంది. తెలుగు సూపర్ హిట్ సినిమాలు ఎంత స్పీడ్ గా వేరే భాషల్లోకి రీమేక్ అవుతున్నాయో, డిఫెరెంట్ లాంగ్వేజెస్ లో సక్సెస్ అయిన సినిమాలు కూడా ఇక్కడ రీమేక్ అవుతున్నాయి.

96 : ఈ సినిమా రీమేక్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ నటించనున్న ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. అంతెందుకు భాష రాక ఇబ్బంది పడుతూ కూడా తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేశారంటే, ఈ సినిమా చుట్టూ ఎంత క్రేజ్ క్రియేట్ అయి ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ సినిమాని దిల్ రాజు నిర్మిద్దామని డిసైడ్ అయ్యాడు.

వాల్మీకి : ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘జిగర్తాండ’ కి రీమేక్. అది సరే.. కానీ ఈ సినిమాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, మెగా హీరో వరుణ్ తేజ్ గ్రే షేడ్స్ లో కనిపిస్తాడు. ఓ వైపు లవర్ బాయ్ గా, మరో వైపు చాలెంజింగ్ సినిమాలు చేస్తూ, ఆల్మోస్ట్ తనపై ఓ పర్టికులర్ ఇమేజ్ లేకుండా మ్యానేజ్ చేసుకుంటున్న వరుణ్ తేజ్, ఈ రీమేక్ లో బాబీ సింహ ప్లే చేసిన పవర్ ఫుల్ విలన్ రోల్ ప్లే చేయబోతున్నాడు. హరీష్ శంకర్ ఈ సినిమాకి డైరెక్టర్.

ఓ బేబీ: వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయిన మిస్ గ్రానీ సినిమాకు రీమేక్ ఇది. ఇదో ఇంట్రెస్టింగ్ ఫెయిరీ టేల్. ఎపుడు రిలీజవుతుందో ప్రస్తుతానికి తెలీదు కానీ, చిన్నపిల్లల దగ్గరి  నుండి ముసలివాళ్ళ వరకు థియేటర్స్ కి వచ్చి చూసే సినిమా ఇది. డైరెక్టర్ నందినిరెడ్డి ఏరి కోరి మరీ ఈ కొరియన్ బ్లాక్ బస్టర్ ని రీమేక్ చేస్తుంది. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ ప్లే చేస్తుంది.

ABCD : మలయాళ బ్లాక్ బస్టర్ ABCD కి రీమేక్ ఇది. అక్కడ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. అదే రోల్ లో ఇక్కడ అల్లు శిరీష్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 21 న రిలీజవుతుంది.

 

దటీజ్ మహాలక్ష్మి : బాలీవుడ్ బ్లాక్ బస్టర్ క్వీన్ కి రీమేక్ ఇది. తమన్నా లీడ్ రోల్ ప్లే చేసింది. కంప్లీట్ గా తెలుగు నేటివిటీ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక సాధారణ అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ చుట్టూ తిరుగుతుంది.  రీసెంట్ గా రిలీజైన ‘కథ మొదలవకే’ సాంగ్ మేకింగ్ వీడియోకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా హిట్టయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

రాట్ససన్ : తమిళంలో సూపర్ హిట్టయిన సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుంది. హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ఆల్రెడీ ఫిక్సయ్యాడు. ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సీత’ కి ప్యాకప్ చెప్పీ చెప్పగానే ఈ సినిమా సెట్స్ పైకి వస్తాడు బెల్లంకొండ. ‘కవచం’ తరవాత ఈ సినిమాలో మళ్ళీ పోలీసాఫీసర్ గా  కనిపిస్తాడు బెల్లంకొండ.

ఫలక్ నుమా దాస్ : మలయాళంలో భారీ సక్సెస్ అందుకున్న ‘అంగమలై డైరీస్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా ఇది. విశ్వక్ సేన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు తెలుగులో. దర్శకుడు కూడా తనే. కల్ట్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో కూడా అదే స్థాయిలో ఎట్రాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కి సోషల్ మీడియాలో వైడ్ రేంజ్ లో అప్లాజ్ దక్కుతుంది.

అయితే ఈ సినిమాల మధ్య మరో రీమేక్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ సారి బాలీవుడ్ సినిమా వంతయింది. రీసెంట్ గా రిలీజై సక్సెస్ ఫుల్ టాక్ అందుకున్న హిందీ సినిమా ‘గల్లీబాయ్’ కూడా రీమేక్ అవుతుందనే వైబ్స్ వినిపిస్తాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఉండబోతోందట. అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే గానీ, ఈ రీమేక్ గురించి మరిన్ని డీటేల్స్ తెలీవు.