టాలీవుడ్ కొత్త సినిమా టైటిల్స్ ఇవే

Wednesday,June 20,2018 - 01:04 by Z_CLU

ఎప్పట్లానే ఈనెల కూడా మరికొన్ని కొత్త టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. సినిమాలు ఎనౌన్స్ చేయకపోయినా, కొన్ని ప్రొడక్షన్ హౌజ్ లు కాస్త ముందుగానే ఆ టైటిల్ ను రిజిస్టర్ చేయించి పెట్టుకున్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్స్ లో కొన్ని చూద్దాం

క్రిష్ కు చెందిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అంతరిక్షం, బొంబాయి చట్నీ అనే 2 టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పేస్ మూవీకి అంతరిక్షం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇకపోతే ‘బొంబాయి చట్నీ’ సినిమాని క్రిష్ ఎవరితో ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక గీతాఆర్ట్స్ బ్యానర్ పై డాన్సర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ రిజిస్టర్ అయింది. నిర్మాత అల్లు అరవింద్, కొడుకు బన్నీని హీరోగా పెట్టి ఈ సినిమా నిర్మిస్తాడేమో. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్లలో బన్నీ ఒకడు. అతడికి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. ఇక అరవింద్ కు చెందిన మరో కంపెనీ గీతాఆర్ట్స్-2పై చరణ్-అర్జున్ అనే మరో టైటిల్ ను రెన్యువల్ చేయించారు. ఇదొక మల్టీస్టారర్ మూవీ అనే విషయం టైటిల్ చూస్తేనే అర్థమౌతోంది.

నటుడు కమ్ కమెడియన్ శ్రీనివాసరెడ్డితో కలిసి దాదాపు 12 మంది హాస్యనటులు నిర్మాతలుగా ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్ టైన్ మెంట్స్ అనే బ్యానర్ పెట్టారు. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, సత్య లాంటి కమెడియన్లు చాలామంది ఇందులో పార్టనర్స్. ఈ బ్యానర్ పై భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. కొత్త నటీనటులు, కొత్త కాన్సెప్టుల్ని ఇందులో పరిచయం చేస్తారు.

వీటితో పాటు మరికొన్ని ప్రముఖ బ్యానర్లపై రిజిస్టర్ అయిన టైటిల్స్ ఇలా ఉన్నాయి.

బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్ LLP – కామెడీ ఎక్స్ ప్రెస్
ఐరా క్రియేషన్స్ – గణ
యూవీ క్రియేషన్స్ – జాన్
ఆరన్ మీడియా వర్క్స్ – కుమారి భారతదేశం (నారా రోహిత్ బ్యానర్ ఇది)
శ్రీ లక్ష్మీ ప్రసన్న మూవీస్ – నట సార్వభౌమ
ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లి. – రాజుగారి గది–3 రాజముద్రిక
కంపెనీ – ఆర్జీవీస్ బ్యూటిఫుల్