Shooting Updates: ట్రాక్ పైకొచ్చిన టాలీవుడ్
Tuesday,June 15,2021 - 01:30 by Z_CLU
ఉన్నట్టుండి ఒక్కసారిగా టాలీవుడ్ ట్రాక్ పైకొచ్చింది. తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గడంతో ఇండస్ట్రీలో సందడి కనిపిస్తోంది. నితిన్ సెట్స్ పైకి రావడం, నాని కొత్త సినిమా స్టార్ట్ చేయడంతో మిగతా సినిమా యూనిట్స్ కూడా ఎలెర్ట్ అయ్యాయి. చకచకా కాల్షీట్లు లాక్ చేస్తున్నాయి, కొత్త షెడ్యూల్స్ ఫిక్స్ చేస్తున్నాయి.
NagaChaitanya Thank You Movie
లాక్ డౌన్ టైమ్ లో ఏకంగా యూరోప్ వెళ్లి మరీ షూటింగ్ చేసుకొచ్చారు నాగచైతన్య-రాశిఖన్నా. ఇప్పుడు మరోసారి Thank You Movie షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారు. 21 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుంది.
Samantha Shaakuntalam
సమంత కూడా శాకుంతలం సినిమా సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. లాక్ డౌన్ వల్ల ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైంది ఈ బ్యూటీ. మధ్యలో ఓటీటీ కోసం వర్క్ చేసింది. ఇప్పుడు శాకుంతలం సెట్స్ పైకి రాబోతోంది. ఈనెల 24 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈ మూవీ కోసం భారీ సెట్ వేశారు. మ్యాగ్జిమమ్ షూటింగ్ అందులోనే.
Raviteja Khiladi
జెట్ స్పీడ్ తో సినిమాలు పూర్తిచేసే రవితేజ కూడా రెట్టించిన ఉత్సాహంతో రెడీ అయిపోయాడు. 26వ తేదీ నుంచి ఖిలాడీ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఖిలాడీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.
RRR Movie
రామ్ చరణ్, తారక్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మాత్రం ఈ నెల సెట్స్ పైకి రావడం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై 1 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి.
F3 Movie
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్3 కూడా జులై 1 నుంచి స్టార్ట్ కాబోతోంది. నిజానికి ఈ సినిమాను ఈ నెలలోనే స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇంకొంతకాలం వేచి చూసి సెట్స్ పైకి రావాలనే ఆలోచనతో కావాలనే గ్యాప్ తీసుకుంటున్నారు.
Chiranjeevi Acharya
చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య కూడా ఈనెల సెట్స్ పైకి రావడం లేదు. వచ్చేనెల మొదటి వారం లేదా రెండో వారంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం CCC వ్యవహారాల్లో బిజీ అయిపోయారు చిరంజీవి. సినీ కార్మికులందరికీ దగ్గరుండి వ్యాక్సిన్ వేయిస్తున్నారు. దీన్ని మధ్యలో ఆపేయడం మెగాస్టార్ కు ఇష్టంలేదు. ఈ డ్రైవ్ పూర్తయిన తర్వాతే ఆచార్య సెట్స్ పైకి వస్తుంది.
Allu Arjun Pushpa
లాక్ డౌన్ పెట్టడానికి ముందు లాస్ట్ మినిట్ వరకు షూటింగ్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప మాత్రమే. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ డేర్ చేసి మరీ షూట్ చేశారు. ఆ తర్వాత ఏకంగా బన్నీకే కరోనా సోకడంతో సినిమా ఆగిపోయింది. అలా ఆగిపోయిన Pushpa Movie ని వచ్చేనెల నుంచి స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ లోనే సెట్ వర్క్ చేస్తున్నారు.
Prabhas RadheShyam
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి అటుఇటుగా 4-5 రోజుల వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. అయినప్పటికీ యూనిట్ తొందరపడడం లేదు. మరికొన్ని రోజులాగి, యూనిట్ లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే సెట్స్ పైకి రావాలనుకుంటున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ అవుతుంది.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics