అదీ మన హీరోల స్ట్రాటజీ

Tuesday,February 19,2019 - 04:35 by Z_CLU

కమర్షియల్ సినిమాల సక్సెస్ లో హీరోయిన్ రోల్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఠక్కున సమాధానం చెప్పలేం కానీ, హీరోహీరోయిన్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంపాక్ట్ మాత్రం 100% ఉంటుంది. అందుకే ఒకసారి ఆడియెన్స్ కి కనెక్ట్ అయిన మ్యాజిక్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికే ఇష్టపడుతుంటారు మన హీరోలు. ఈ లిస్టు లో బన్ని కూడా ఉన్నాడు.

మ్యాగ్జిమం మార్చిలో సెట్స్ పైకి వచ్చేస్తుంది బన్నీ-త్రివిక్రమ్ సినిమా. ఈ సినిమాలో బన్నీ హీరోయిన్ ప్లేస్ లో పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. ఇంతకీ పూజా హెగ్డేని ఫిక్సయ్యారా లేదా అనేది తెలీదు కానీ, కన్సిడర్ స్టేజ్ లో అయితే పూజా హెగ్డే ప్రొఫైల్ ఉంది, అది మాత్రం పక్కా. గతంలో ‘DJ’ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది సో, ఈసారి కూడా పూజానే బన్నీ ప్రిఫర్ చేస్తున్నాడని టాక్.

మరోపక్క నాగార్జున ‘మన్మధుడు-2’ ప్రిపరేషన్స్ కూడా స్పీడందుకున్నాయి. ఈ సినిమాలో నాగ్ సరసన అనుష్క నటించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో కనిపించినా లాంగ్ గ్యాప్ తరవాత మళ్ళీ కలిసి స్క్రీన్ పై ఫుల్ టైమ్ జోడీగా కనిపిస్తారగానే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

ఈ వరసలో చైతు కూడా ఉన్నాడు. గతంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో రకుల్ ప్రీత్ తో నటించిన నాగచైతన్య, ఈ హీరోయిన్ ని ‘వెంకీ మామ’ లో కూడా రిపీట్ చేస్తున్నాడు. చైతు రిపీటెడ్ హీరోయిన్స్ లిస్టులో సమంతా కూడా ఉంది. ఇద్దరూ కలిసి ప్రస్తుతం మజిలీ చేస్తున్నారు.

హీరోయిన్ ని రిపీట్ చేయడంలో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. రీసెంట్ గా ‘కవచం’ లో కాజల్ అగర్వాల్ తో నటించిన ఈ హీరో, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న తేజ సినిమా ‘సీత’లో కూడా కాజల్ ల్ తోనే నటిస్తున్నాడు.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విజయ్ దేవరకొండ. ‘గీతగోవిందం’ లో రష్మిక తో నటించిన విజయ్, అంతలోనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోను రష్మిక తోనే జోడీ కట్టాడు. ‘గీతగోవిందం’ తరవాత   ఈసారి డిఫెరెంట్ కెమిస్ట్రీ తో మెస్మరైజ్ చేయనుందీ జోడి.