Dinesh Naidu - టాలీవుడ్ లో ఈ హీరో ఎవరు?

Wednesday,May 05,2021 - 01:00 by Z_CLU

హీరో విశ్వక్ సేన్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో. మరి హీరో దినేష్ నాయుడు గురించి తెలుసా? ఈయన కూడా టాలీవుడ్ లో ఉన్నాడు. హీరోగా సినిమాలు కూడా చేశాడు. ఇప్పటివరకు ఈ పేరు వినలేదా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

హీరో విశ్వక్ సేన్ అసలు పేరే ఈ దినేష్ నాయుడు. పక్కా తెలుగు పేరు. తెలుగు వ్యక్తి. విశ్వక్ ను అంతా నార్త్ ఇండియన్ అనుకుంటారు. కానీ విస్వక్ తెలుగోడే. అతడి అసలు పేరు దినేష్ నాయుడు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో పుట్టిన ఈ హీరోకు తల్లిదండ్రులు దినేష్ నాయుడు అనే పేరు పెట్టారు.

vishwak sen

అయితే న్యూమరాలజీ ప్రకారం ఆ పేరు పెట్టుకుంటే పెద్దగా కలిసిరాదనేది విశ్వక్ తండ్రి అభిప్రాయం. అందుకే ఆయన సూచన మేరకు తన పేరును విశ్వక్ సేన్ గా మార్చుకున్నాడు ఈ హీరో. ఈ పేరు సూచించింది కూడా విశ్వక్ తండ్రే. 4 పేర్లు సెలక్ట్ చేస్తే, అందులోంచి ఫైనల్ గా విశ్వక్ సేన్ అనే పేరును సెలక్ట్ చేసుకున్నాడు ఈ నటుడు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలా తన అసలు పేరును బయటపెట్టాడు విశ్వక్.

Nivetha Pethuraj As Theera In Vishwak Sen Paagal

మొత్తానికి తండ్రి నమ్మకమే నిజమైంది. విశ్వక్ సేన్ వరుసగా హిట్స్ కొట్టాడు. ఫలక్ నుమా దాస్ తర్వాత హిట్ మూవీతో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడు నటించిన పాగల్ సినిమా కరోనా సెకెండ్ వేవ్ వల్ల ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో పాటు మరో 2 రీమేక్స్ చేస్తున్నాడు ఈ హీరో.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics