టాలీవుడ్ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్

Saturday,July 08,2017 - 10:44 by Z_CLU

అద్భుతమైన సినిమాలతో 2017 సరికొత్తగా బిగిన్ అయింది. కొన్ని సినిమాలు హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయి రికార్డ్స్ బ్రేక్ చేస్తే, మరికొన్ని సినిమాలు  సర్ ప్రైజింగ్ కంటెంట్ తో రిలీజై సక్సెస్ అయ్యాయి. జనవరి నుండి బిగిన్ అయితే  బాక్సాఫీస్ దగ్గర మంచి మార్కులు దక్కించుకున్న సినిమాలతో 6 నెలల బాక్సాఫీస్ రివ్యూ

జనవరి : నిజానికి టాలీవుడ్ లో సంక్రాంతి 11 నుండే బిగిన్ అయింది. ‘ఖైదీ నం 150’ తో ఫెస్టివల్ సీజన్ బిగిన్ అయితే, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణీ ఫీస్ట్ సీజన్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. ఈ రెండు బడా సినిమాల మధ్య సంక్రాంతి పండగకి పర్ ఫెక్ట్ ఎంటర్ టైనర్ అనిపించుకున్న ‘శతమానం భవతి’ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఫిబ్రవరి :  ఫిబ్రవరిలో ఏకంగా మూడు డిఫెరెంట్ జోనర్స్ లలో రిలీజైన నేను లోకల్, ఓం నమో వేంకటేశాయ, ఘాజి బాక్సాఫీస్ దగ్గర మంచి స్టాండ్ ని చూపించాయి. న్యాచురల్ స్టార్ నాని నేను లోకల్ అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ గా ఎంటర్ టైన్ చేస్తే, డివోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఓం నమో వేంకటేశాయ మరోసారి దర్శకేంద్రుడి మార్క్ ని ఎలివేట్ చేసింది. ఇక డిఫెరెంట్ సినిమాలతో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న రానా, ఘాజి సక్సెస్ తో వార్ స్టార్ అనిపించుకున్నాడు.

మార్చి ఇక 2017 మార్చి లో బాక్సాఫీస్ దగ్గర పవర్ ప్యాక్డ్ కలెక్షన్స్ రికార్డ్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ బాక్సాఫీస్ కలెక్షన్స్ తో అదరగొడితే, రాజ్ తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ థియేటర్స్ లో ఎంతలా నవ్వించిందో బాక్సాఫీస్ దగ్గర అంతే రేంజ్ లో కలెక్ట్ చేసుకుంది. ఇక విక్టరీ వెంకటేష్ స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్ టైనర్ ‘గురు’ అన్ని క్యాటగిరీస్ ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది.

ఏప్రియల్ : ది బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ బాహుబలి రిలీజయింది ఈనెలలోనే. భారీ అంచనాల మధ్య రిలీజయిన ఈ సినిమా ఎక్స్ పెక్టేషన్స్ ని మించిన సక్సెస్ సాధించింది. వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లు వసూలు చేసింది. ఇక మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన ‘చెలియ’ ఫస్ట్ లుక్స్, టీజర్స్ తో ఎట్రాక్ట్ చేయగలిగినా బాక్సాఫీస్ దగ్గర గట్టిగా నిలబడలేకపోయింది.

మే : సమ్మర్ హాలీడేస్ ని టార్గెట్ చేసుకుని రిలీజైన రారండోయ్ వేడుక చూద్దాం ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లో ఆకట్టుకుంది. నాగ చైతనయ కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ట్యాగ్ ని బ్యాగ్ లో వేసుకున్న ‘రారండోయ్’ బాక్సాఫీస్ దగ్గర కూడా సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. ఇక దేనికదే స్పెషల్ అనిపించుకున్న వెంకటాపురం, కేశవ, రాధ సినిమాలు కూడా సక్సెస్ ఫుల్ సినిమాల క్యాటగిరీ లో స్పేస్ క్రియేట్ చేసుకున్నాయి.

జూన్ : జూన్ లో కూడా బాక్సాఫీస్ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ తోనే క్లోజ్ అయింది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్  గా తెరకెక్కిన DJ వారం కూడా తిరక్కముందే 100 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తే, డిఫెరెంట్ కంటెంట్ తో తెరకెక్కిన అంధగాడు, ఫన్ లోడెడ్ ఎంటర్ టైనర్ గా ఎట్రాక్ట్ చేసిన అమీ తుమీ కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుకున్నాయి.

ఈ ఆరు నెలల్లో మొత్తం 81 సినిమాలు రిలీజైతే అందులో కొన్ని బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డ్స్ సృష్టిస్తే, మరికొన్ని యావరేజ్ టాక్ తో సర్దుకుపోయాయి. వీటి మధ్య హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన బాహుబలి 2, జస్ట్ టాలీవుడ్ లోనే కాదు వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసి ఈ ఏడాదిలోనే కాదు.. భారతీయ సినీచరిత్రలోనే అతిపెద్ద మూవీగా నిలిచింది.