టాలీవుడ్‌ ఫస్ట్‌ హాఫ్‌ రిపోర్ట్‌ 2018

Wednesday,July 04,2018 - 04:01 by Z_CLU

ఒక బ్లాక్‌ బస్టర్‌. మరొక బంపర్‌ హిట్‌. చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్‌ హిట్‌. మరికొన్ని సూపర్‌హిట్‌లు, ఇంకొన్ని యావరేజ్‌ మూవీలు, ఊహించని డిజాస్టర్లు.. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ టాలీవుడ్‌ ప్రస్థానం ఇలా సాగింది. మొదటి 6 నెలల్లో ఇలా మిక్స్ డ్ రిజల్ట్ చూసింది బాక్సాఫీస్.

ఇయర్ ఇలా స్టార్ట్ అయిందో లేదో ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ కు ఊహించని షాక్. గ్యారెంటీ హిట్ ఎక్స్ పెక్ట్ చేసిన అజ్ఞాతవాసి పూర్తిగా నిరాశపరిచింది. కొత్త ఏడాది ప్రారంభం, అందులో సంక్రాంతి సీజన్ లో ఓ పెద్ద సినిమాకు ఇలా జరగడం నిజంగా అందర్నీ నిరాశపరిచింది. అలా డల్ గా ప్రారంభమైన టాలీవుడ్ బాక్సాఫీస్, జై సింహాతో కాస్త
తేరుకుంది. ఇదే టైమ్ లో వచ్చిన డబ్బింగ్ మూవీ గ్యాంగ్ కూడా ఫర్వాలేదనిపించుంది.

అలా డల్ గా ప్రారంభమైన బాక్సాఫీస్ కు నాగశౌర్య ఓ ఊపు తీసుకొచ్చాడు. ఫిబ్రవరిలో వచ్చిన ఛలో సినిమా సూపర్ హిట్ అయింది. అదిరిపోయే పంచ్ లతో అందర్నీ కట్టిపడేసింది. ఇక ఇదే నెలలో వచ్చిన తొలిప్రేమ, అ! సినిమాలు కూడా హిట్ అయ్యాయి.

మార్చి నుంచి అసలైన బాక్సాఫీస్ సందడి మొదలైంది. ఈ నెలలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా విడుదలైంది. బాహుబలి-2 తర్వాత ఆ స్థాయిలో హిట్ అయిన సినిమాగా పేరుతెచ్చుకుంది. ఇక మార్చిలోనే వచ్చిన నీది నాది ఒకే కథ సినిమా కూడా తన రేంజ్ లో అందరితో శభాష్ అనిపించుకుంది.

చిట్టిబాబు తెచ్చిన సక్సెస్ సంబరాన్ని భరత్ కొనసాగించాడు. ఏప్రిల్ లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదే నెలలో నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ కూడా రిలీజై ఫర్వాలేదనిపించుకుంది.

ఇక ఈ ఏడాది మే నెల టాలీవుడ్ కు ఓ చక్కటి క్లాసిక్ ను అందించింది. అదే మహానటి సినిమా. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాపై ఒక్క విమర్శ కూడా లేదంటే, మూవీ ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే నెలలో వచ్చిన నా పేరు సూర్య సినిమా కూడా మంచి వసూళ్లు సాధించి బాక్సాఫీస్ కు కళ తీసుకొచ్చింది.

జూన్ లో ఏకంగా 3 సినిమాలు క్లిక్ అయ్యాయి. విశాల్ నటించిన అభిమన్యుడు, సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాలతో పాటు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది చిత్రాలు హిట్ అయ్యాయి.

మొత్తంగా చూసుకుంటే.. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్స్ అనిపించుకున్నాయి. ఓవరాల్ గా డబ్బింగ్ సినిమాలతో కలుపుకొని 97 సినిమాలు రిలీజ్ అవ్వగా.. 6 సినిమాలు మాత్రం క్లిక్ అయ్యాయి