టాలీవుడ్ ఫిబ్రవరి హంగామా....

Thursday,January 26,2017 - 12:06 by Z_CLU

టాలీవుడ్ లో ఫిబ్రవరి హంగామా అప్పుడే స్టార్ట అయింది. సంక్రాంతి పండగ సందడితో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో జనవరి క్లోజ్ అవుతోంది. ఇప్పుడు అదే జోష్ తో ఫిబ్రవరి కూడా మొదలుకాబోతోంది. బడా బడా సినిమాలన్నీ ఫిబ్రవరిలోనే సెట్స్ పైకి వస్తున్నాయి.

 01

కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ తో సినిమా కన్ఫం చేసిన పవర్ స్టార్ ఫిబ్రవరి కల్లా సెట్స్ పై ఉండటం ఖాయం. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువెల్ హీరోయిన్స్ గా ఫిక్సయ్యారు. ఈ సినిమాతో తమిళనాట సంచలనం సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.

 02

జనతా గ్యారేజ్ తర్వాత చిన్న సైజు బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్…  ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు. బాబీ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేసిన యంగ్ టైగర్… ఫిబ్రవరి 11 న పూజా కార్యక్రమాలతో సినిమాని లాంచ్ చేయబోతున్నాడు. NTR ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తాడు. NTR సరసన మెరవనున్న హీరోయిన్ డీటెయిల్స్ తో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

03

ధృవ లాంటి స్టైలిష్ ఎంటర్ టైనర్ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో మెస్మరైజ్ చేసే మెగా ప్లానింగ్ లో ఉన్నాడు చెర్రీ. ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కూడా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా ఫిక్సయిందని ఇండస్ట్రీ టాక్. రాక్ స్టార్ DSP మ్యూజిక్ కంపోజ్ చేయనున్న ఈ సినిమా.. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.

 04

నాగార్జున కరియర్ లోనే ఫస్ట్ టైం హారర్ థ్రిల్లర్ కి సంతకం చేశాడు. అదే రాజుగారి గది-2. ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మిస్తాడు.  తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కి ఆల్ రెడీ ప్యాకప్ చెప్పేసిన ఓంకార్… ఫిబ్రవరి నుంచి షూటింగ్ ను పరుగులు పెట్టించబోతున్నాడు.

 05

గురు లాంటి స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ తరవాత మరో రీఫ్రెషింగ్ సినిమాతో సెట్స్ పైకి వచ్చే ఆలోచనలో ఉన్న వెంకీ, రీసెంట్ గా కిషోర్ తిరుమల తో సినిమాని అనౌన్స్ చేశాడు. ఇంతలో వెంకీ డైరెక్టర్స్ అకౌంట్ లో పూరి జగన్నాథ్ పేరు కూడా వినిపిస్తోంది. ఇంటర్నల్ గా వెంకీ నెక్స్ట్ సినిమా గురించి జరిగే డిస్కషన్స్ అయితే అఫీషియల్ గా బయటికి రాలేదు కానీ, గురు సినిమా షూటింగ్ ఎలాగూ పూర్తయింది కాబట్టి, ఫిబ్రవరిలో కిషోర్ తిరుమల లేదా పూరి జగన్నాథ్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో వెంకీ సెట్స్ పైకి రావడం ఖాయం.

06

బెంగాల్ టైగర్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రవితేజ, ఫిబ్రవరిలో మాస్ స్పీడ్ తో మళ్ళీ సెట్స్ పైకి వస్తున్నాడు. విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమా హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడట. రాశిఖన్నాతో జోడీ కట్టనున్న మాస్ మహారాజ్ స్పీడ్ చూస్తుంటే బ్యాక్ టు ఫామ్ అనిపిస్తుంది. ఈ సినిమాకి నల్లమలుపు బుజ్జి ప్రొడ్యూసర్.

 07

నాగచైతన్య – కృష్ణ మరిముత్తు ఈ కాంబో గురించి మాట్లాడే ముందు రానా గురించి మాట్లాడాలి. ఈ సినిమాతో రానా నిర్మాతగా మారుతున్నాడు. కృష్ణ మరిముత్తు డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ అయితే అనౌన్స్ కాలేదు కానీ, మ్యాగ్జిమం ఫిబ్రవరిలోనే సినిమా సెట్స్ పైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హీరోయిన్ ఎవరా అన్న సస్పెన్స్ సినిమా లాంచ్ అయ్యాకే తెలుస్తుంది.

 08

రాజ్ తరుణ్ సినిమాతో సంజన అనే మరో లేడీ డైరెక్టర్ టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతోంది. ఈ సినిమాకి మారుతి స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. రాజ్ తరుణ్ సరసన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించే స్కోప్ ఉన్నట్టు సమాచారం. ఆల్ రెడీ హీరోయిన్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్న సినిమా యూనిట్, ఫిబ్రవరిలో సినిమాని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీత దర్శకుడు.

09

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఫిదా, శ్రీనువైట్ల మిస్టర్ సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ రీసెంట్ గా తన బర్త్ డే రోజు వెంకీ అట్లూరి తో సినిమా అనౌన్స్ చేశాడు. ఆల్ రెడీ సెట్స్ పై ఉన్న సినిమాల్లో మిస్టర్ మూవీ దాదాపు ప్యాకప్ కి దగ్గర పడింది కాబట్టి, ఫిబ్రవరిలో వెంకీ అట్లూరి తో వరుణ్ తేజ సెట్స్ పైకి వెళ్లే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి DSP మ్యూజిక్ కంపోజర్ గా ఫిక్సయిపోయాడు.

 10

శ్రీరస్తు శుభమస్తు లాంటి డీసెంట్ హిట్ తరవాత Vi ఆనంద్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ తో సెట్స్ పైకి రానున్నాడు అల్లు శిరీష్. మిగతా స్టార్ కాస్టింగ్ సెలక్షన్ లో బిజీగా ఉన్న సినిమా యూనిట్, ఫిబ్రవరిలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉంది.