నాన్నే ఇప్పుడు హిట్ ఫార్ములా

Tuesday,September 27,2016 - 12:20 by Z_CLU

అమ్మ సెంటిమెంట్ కాస్తా ఫాదర్ క్యారెక్టర్స్ కి ట్రాన్సఫర్ అయింది. ఒకప్పుడు సినిమాల్లో నాన్న పాత్రలు కేవలం గాంభీర్యం ప్రదర్శించడానికే. మార్కులన్నీ అమ్మ క్యారెక్టర్ కే. కానీ ఇప్పుడలా లేదు. అమ్మ క్యారెక్టర్ ఎలా ఉన్నా ఫాదర్ క్యారెక్టర్ అదిరిపోతోంది. నాన్న చుట్టూ తిరుగుతూ హీరోయిజం చూపే సినిమాలే ఇప్పుడు హాట్ హిట్ ఫార్ములా.

28-prakash-raj-mahesh-babu-aagadu

మహేష్ కరియర్ లో ఉన్న బిగ్గెస్ట్ హిట్స్ లో దూకుడు కూడా ఒకటి. సినిమాలో హీరో క్యారెక్టర్ I.P.S. ఆఫీసర్ అయినా కథ మాత్రం హీరో చేయాల్సిన డ్యూటీ కన్నా తండ్రి చుట్టే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఫస్టాఫ్ సంగతి అటుంచితే సెకండాఫ్ మొత్తం తండ్రికి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలీనివ్వకూడదు అన్న చిన్న పాయింట్ పైనే సినిమా ఆద్యంతం అలరిస్తుంది.

nannaku_prematho_title_song_launch_stills_129327e

N T R హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నాన్నకు ప్రేమతో. ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తో మ్యాగ్జిమమ్ అందరినీ ఆకట్టుకుంది. సుకుమార్ సినిమాలంటేనే కొత్తదనం. టైటిల్ కి తగ్గట్టు హీరో క్యారెక్టర్ ఏ చిన్న పని చేసినా అది నాన్నపై ప్రేమతోనే చేస్తాడు. చావు, బ్రతుకుల మధ్య ఉన్న తండ్రి పెదాలపై చిరునవ్వును చూడటం కోసం హీరో పడే తపనే “నాన్నకు ప్రేమతో”.

sathyaraj-and-mahesh

రీసెంట్ గా వచ్చిన బ్రహ్మోత్సవం కూడా నాన్న కథే. తండ్రిచాటు బిడ్డగా, తండ్రి ఆలోచనల్ని ఆచరిస్తూ, కొనసాగించే తనయుడిగా బ్రహ్మోత్సవంలో మహేష్ అద్భుతంగా నటించాడు. సినిమాలో లవ్, ఫ్యామిలీ, రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నప్పటికీ… అన్నింటినీ అంతర్లీనంగా కలిపిన నాన్న పాత్రే.

nenu_sailaja_movie_release_posters_wallpapers_123d235
ఇక ఈ వీకెండ్ రాబోతున్న హైపర్ కూడా ఓ తండ్రి కథే. సినిమా గురించి ప్రేక్షకులు ఏవోవో ఊహించుకోకుండా… టీజర్ నుంచే సినిమాను తండ్రి చుట్టూ తిప్పారు. చిన్నప్పట్నుంచి తండ్రినే హీరోగా భావిస్తాడు మన హీరో రామ్. అలాంటి తండ్రికి ఆపద వస్తే రామ్ ఎంత హైపర్ గా మారిపోయాడనేదే స్టోరీ. మధ్యలో మరో చిన్న లవ్ ట్రాక్. ఓవరాల్ గా కామెడీ. ఇలా ఫుల్ మీల్స్ లా ఉండబోతోంది హైపర్.